జొమాటో కేసులో ట్విస్ట్... తప్పుడు ఆరోపణలు మహిళపై డెలివరీ బాయ్ కేసు

Published : Mar 16, 2021, 09:13 AM IST
జొమాటో కేసులో ట్విస్ట్... తప్పుడు ఆరోపణలు మహిళపై డెలివరీ బాయ్ కేసు

సారాంశం

తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ డెలివరీ బాయ్ కామరాజ్ సదరు మహిళ హితేషా పై ఫిర్యాదు చేశాడు. తనపై చెప్పుతో దాడి చేయడమే కాకుండా.. ఆమెను తాను కొట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తోందంటూ.. డెలివరీ బాయ్ సదరు మహిళపై ఫిర్యాదు చేశాడు.   

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. ఆ సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్.. ఓ మహిళ పట్ల దాడి చేశాడంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫుడ్ ఆలస్యమైందని ప్రశ్నించినందుకు తనపై డెలివరీ బాయ్ దాడి చేశాడంటూ సదరు మహిళ వాపోయింది. 

ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. సదరు డెలివరీ బాయ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అతనిపై మహిళ కేసు కూడా పెట్టింది. అయితే.. తానేమీ మహిళపై దాడి చేయలేదని.. తన ముక్కును తానే గాయపరుచుకుందని.. తనపై చెప్పుతో దాడి కూడా చేసింది అనేది.. డెలివరీ బాయ్ వాదన. కాగా.. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ వచ్చి పడింది. 

తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ డెలివరీ బాయ్ కామరాజ్ సదరు మహిళ హితేషా పై ఫిర్యాదు చేశాడు. తనపై చెప్పుతో దాడి చేయడమే కాకుండా.. ఆమెను తాను కొట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తోందంటూ.. డెలివరీ బాయ్ సదరు మహిళపై ఫిర్యాదు చేశాడు. 

‘‘ఆమెకు భోజనం అందించిన తర్వాత బిల్లు చెల్లించమని అడిగాను. అంతేకాదు ట్రాఫిక్‌జాం వల్ల ఆలస్యమైందని, అందుకు నన్ను క్షమించమని కోరాను కూడా. కానీ ఆమె ఫుడ్‌ తీసుకునేందుకు నిరాకరించారు. ఎలాగోలా ఒప్పించాను. అంతలోనే ఆమె ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసినట్లు నాకు సమాచారం అందింది. దీంతో ఫుడ్‌ ప్యాకెట్‌ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాను. కానీ, నేను ఎంతగా అడిగినా తను సరిగా స్పందించలేదు. ఇక లాభం లేదనుకుని తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే హిందీలో తిట్టడం మొదలుపెట్టారు. నన్ను నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. ఆమె ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నేను తనపై చేయి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.  ఇక కేసులో ఇరుక్కున్న కారణంగా చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు, తనకు ఇప్పటికే రూ. 25 వేలు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu