భర్త కళ్లెదుటే... వదినపై మరిది అఘాయిత్యం..!

Published : Mar 16, 2021, 08:01 AM IST
భర్త కళ్లెదుటే... వదినపై మరిది అఘాయిత్యం..!

సారాంశం

ఆమె అలా మరో పెళ్లి చేసుకోవడం పట్ల ఆమె మొదటి భర్త కుటుంబం రగిలిపోయింది.  ఈ క్రమంలోనే ఆమెను ఎలాగైనా నాశనం చేయాలని భావించారు.

తల్లి లాంటి వదినపై ఓ కామాంధుడు కన్నేశాడు. తనతో పాటు మరో నలుగురితో కలిసి వదినపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్తను  కట్టేసి.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బరాన్ జిల్లాకు చెందిన ఓ మహిళకు గతంలో వివాహమైంది. కాగా.. కొన్ని కారణాల వల్ల ఆమె భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో సంతోషంగా ఉంటోంది. కాగా.. ఆమె అలా మరో పెళ్లి చేసుకోవడం పట్ల ఆమె మొదటి భర్త కుటుంబం రగిలిపోయింది.  ఈ క్రమంలోనే ఆమెను ఎలాగైనా నాశనం చేయాలని భావించారు.

సదరు మహిళ తన రెండో భర్తతో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా.. దాడి చేశారు. అతనిని బంధించి.. భర్త కళ్లెదుటుగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు తన భర్తతో కలిసి సదార్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మొదటి భర్త కుటుంబసభ్యులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తెలుస్తోంది. 

 ఉద్దేశపూర్వకంగా.. ఆమెపై కక్ష కట్టి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని ఎస్పీ వినీత్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం వారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రధాన నిందితుడు దినేశ్‌గా గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet:మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet Telugu
PM Modi Speech: రౌడీలు, గూండాలు మర్యాదగా లొంగిపోండి బెంగాల్లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu