
దోస్తులతో సరదాగా గడపడం, గాసిప్స్ చేయడం, సినిమాలు చూడటం లాంటివి చేసే వయసు.. 19 ఏండ్ల వయస. కానీ ఈ వయసులోనే ఓ కుర్రాడు కోట్ల విలువ చేసే కంపెనీని నిర్మించాడు. 19 ఏండ్ల కుర్రాడు సొంతంగా రూ.7300 కోట్ల విలువైన కంపెనీని నిర్మించాడంటే నమ్మబుద్ది కావడం లేదుకదా. కానీ ఇది నిజం. కుటుంబ సభ్యుల నుంచి పాకెట్ మనీ అడిగే వయసులో ఈ కుర్రాడు ఏకంగా రూ.1200 కోట్లు సంపాదిస్తున్నాడు. ఓ మంచి ఆలోచన కైవల్య వోహ్రా తలరాతను పూర్తిగా మార్చేసింది. ఈ కైవల్య ఎవరో కాదు ఆన్ లైన్ గ్రోసరీ డెలివరీ యాప్ జెప్టో సహ వ్యవస్థాపకుడు. ఇతను కేవలం 19 సంవత్సరాల వయస్సులో జెప్టోను ప్రారంభించాడు.
కైవల్య వోహ్రా ముంబై కి చెందిన వ్యక్తి. ఇతర 2001లో జన్మించాడు. కైవల్య ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తంలో ముంబైలోనే సాగింది. ఇక అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివాడు. అయితే అతను చదువు కంటే స్టార్టప్ ల మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచాడు. కైవల్య తన స్నేహితుడు అదిత్ పాలిచాతో కలిసి 17 ఏళ్ల వయసులో తొలి స్టార్టప్ ను స్టార్ట్ చేశాడు. విద్యార్థులుగా ఉంటూనే ఈ ఇద్దరూ పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగారు. ఇక తన స్టార్టప్ కు గోపూల్ అని పేరు పెట్టాడు. చదువుతో పాటు సంస్థను నడపడం కష్టంగా మారడంతో కైవల్య చదువును పుల్ స్టాప్ పెట్టేసి ముంబైకి వచ్చాడు.
జెప్టో ఎలా ప్రారంభమైంది?
జెప్టోను ప్రారంభించాలనే ఆలోచన కాలేజీ చదువుతున్న సమయంలోనే ఇద్దరికీ వచ్చింది. అయితే వారు ఎప్పుడు ఏ వస్తువును ఆర్డర్ చేసినా వారికి చేరడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టేది. దీని నుంచే కొన్ని గంటల్లోనే సరుకులు డెలివరీ అయ్యే కంపెనీని ప్రారంభించాలనే ఐడియా వచ్చిందట. అందుకే అతను 2021లో కరోనా మహమ్మారి సమయంలో జెప్టోను ప్రారంభించాడు. ముంబైకి చెందిన 1000 మంది ఉద్యోగులు, డెలివరీ ఏజెంట్లతో ఈ సంస్థను ప్రారంభించారు.
ఏడాదిలో రూ.1,7300 కోట్ల కంపెనీ
కరోనా సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా పోవడంతో జెప్టో మొదలైంది. ఇది వారికి ఒక గొప్ప అవకాశమనే చెప్పాలి. దీని వల్ల వారు కూడా ఎంతో లబ్ది పొందారు. ఒక్క నెలలోనే 200 మిలియన్లు సంపాదించాడంటే మామూలు మాటలు కాదు. ఇక ఏడాదిలో కంపెనీ విలువ 900 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 7300 కోట్లు దాటింది. జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా సంపద రూ.1200 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ధనవంతుడిగా ఇతను పేరుపొందాడు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తొలిసారిగా ఆయన పేరును నమోదు చేశారు.
10 నిమిషాల్లో డెలివరీ ఆలోచన
స్టార్టింగ్ జెప్టో ద్వారా ప్రజలకు సరుకులు చేరుకోవడానికి 45 నిమిషాలు పట్టేది. కాని వస్తువులను త్వరగా చేరుకుంటున్న వారు వారి సేవతో మరింత సంతోషంగా ఉన్నారని, పదేపదే ఆర్డర్ చేస్తున్నారని ఈ స్టార్టప్ కంపెనీ గమనించింది. ఈ కారణంగా అతను జెప్టోలో 10 నిమిషాల్లో డెలివరీ అనే కాన్సెప్ట్ ను కూడా ఉంచాడు. అప్పటికే మార్కెట్లో ఉన్న బిగ్ బజార్ ను ఎదుర్కోవడానికి, జెప్టో కోసం 10 నిమిషాల డెలివరీ ప్లాన్ అవసరం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే కంపెనీ బంపర్ లాభాలను ఆర్జించింది. గత ఏడాది కాలంలో దీని విలువ 50 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం జెప్టో విలువ రూ.7300 కోట్లకు చేరింది. ఇటీవల ఈ సంస్థ స్టార్టప్ లు వై కంబినేటర్, గ్లాడ్ బ్రూక్ క్యాపిటల్ నుంచి 60 మిలియన్ డాలర్ల నిధులను పొందింది.
అంతకంతకూ పెరుగుతున్న నెట్ వర్క్
ప్రస్తుతం జెప్టో భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ తన నెట్ వర్క్ ను రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. ఈ సంస్థలో 1,000 మందికి పైగా పనిచేస్తున్నారు. కంపెనీ తన ప్లాట్ఫామ్ పై 3,000 కి పైగా ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. క్విక్ డెలివరీ సర్వీస్ కారణంగా కంపెనీ మార్కెట్ లోల మనుగడ సాగించడమే కాకుండా మంచి లాభాలను కూడా ఆర్జిస్తోంది.