కరోనాకు మందు కనిపెట్టిన హైద్రాబాద్ హెటిరో: కోవిఫోర్‌ పేరుతో మార్కెట్లోకి విడుదల

By narsimha lode  |  First Published Jun 21, 2020, 12:04 PM IST

కరోనాను నిరోధించేందుకు మందును కనిపెట్టినట్టుగా హైద్రాబాద్ హెటిరో ఫార్మాసూటికల్స్ ఆదివారం నాడు  ప్రకటించింది.



హైదరాబాద్: కరోనాను నిరోధించేందుకు మందును కనిపెట్టినట్టుగా హైద్రాబాద్ హెటిరో ఫార్మాసూటికల్స్ ఆదివారం నాడు  ప్రకటించింది.కోవిఫర్ పేరుతో జనరిక్ మందును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టుగా ఆ సంస్థ తెలిపింది. ఈ మందును విక్రయించేందుకు డీసీజీఐ అనుమతి కూడ ఇచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది.

ప్రజలకు ఈ మందును అందుబాటులోకి తీసుకొస్తామని హెటిరో తెలిపింది.కరోనా నివారణకు పరిశోధనాత్మక యాంటీవైరల్ మెడిసినల్ రెమిడెసివిర్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేయడానికి  ఆమోదం లభించిందని  ఆ సంస్థ  ప్రకటించింది.

Latest Videos

undefined

తక్కువ, మధ్య ఆదాయంలో కరోనా చికిత్స కోసం గిలియడ్ సైన్సెస్ ఇంక్ తో లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారంగా సానుకూల క్లినికల్ ఫలితాలను అనుసరించి హెటిరో భారత్ లో కోవిఫోర్ బ్రాండ్ పేరుతో మొదటి జనరిక్ రెమ్ డెసివిర్ ను ఉత్పత్తి చేయనుంది.

కరోనాతో ఆసుపత్రిలో చేరిన పిల్లలతో పాటు ఇతరులకు ఈ డ్రగ్ ను ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.గ్లెన్ మార్క్ జనరిక్ యాంటీ వైరల్ డ్రగ్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన మరునాడే హెటిరో సంస్థ తయారు చేసిన డ్రగ్ కు కూడ అనుమతి లభించింది.గ్లెన్ మార్క్ టాబ్లెట్ల రూపంలో మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హెటిరో సంస్థ మాత్రం ఇంజక్షన్ రూపంలో మందును అందుబాటులోకి తెచ్చింది.


 


 

click me!