జూన్ 21 ప్రత్యేకత: ఏడు అద్భుత వింతలు సమాహారం!

By Sreeharsha GopaganiFirst Published Jun 21, 2020, 1:15 PM IST
Highlights

మామూలుగా అయితే మనకు ఈ రోజు యోగ దినోత్సవం అని మాత్రమే తెలుసు.కానీ నేడు కేవలం మూడు కాదు 7 వింతలు ఉన్నాయి. 

నేడు జూన్ 21. మామూలుగా అయితే మనకు ఈ రోజు యోగ దినోత్సవం అని మాత్రమే తెలుసు. ఇంకొంతమందికి నేడు అత్యంత పొడవైన రోజు(పగలు  నిడివి ఎక్కువ కలిగిన రోజు) నిడివి  అని కూడా తెలుసు. ఇక నేడు గ్రహణం కూడా ఉందని చెబుతున్నారు. అందరికి తెలిసినంతవరకు నేటికీ ఇవి మాత్రమే ప్రత్యేకతలు. 

కానీ నేడు కేవలం మూడు కాదు 8 వింతలు ఉన్నాయి. మొదటగా మనందరికీ తెలిసినట్టే నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం. నేడు మ్యూజిక్ దినోత్సవం,. ఇక ప్రతిసంవత్సరం మూడవ ఆదివారం ఫాథర్స్ డే గా జరుపుకుంటాము. ఈసారి మూడవ ఆదివారం 21వ తేదీనే వచ్చింది. భూమి ఉత్తరార్థంలో అత్యంత పొడవైన దినోత్సవం కూడా నేడే. 

ఇదే రోజున మనం వరల్డ్ హ్యూమనిస్ట్ డే గా జరుపుకుంటుంటాము. నేడు మనం హ్యాండ్ షేక్ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాము. కాకపోతే కరోనా దెబ్బకు ఇంకొన్ని సంవత్సరాలపాటు హ్యాండ్ షేక్ అంటేనే అమ్మ బాబోయి అనేలా ఉన్నారు. 

ఇక నేడు వరల్డ్ హైడ్రాలజీ డే కూడా. అంటే అంతర్జాతీయ జలవనరుల దినోత్సవం. అంతే నేడు అంతర్జాతీయ టి షర్ట్ డే. 2008లో తొలిసారి ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. 

click me!