YS Jagan Mohan Reddy Biography: వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, నవ ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్య మంత్రి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
YS Jagan Mohan Reddy Biography:
బాల్యం, విద్యాభ్యాసం:
వైఎస్ జగన్ పూర్తి పేరు యెదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి- విజయమ్మ దంపతులకు 1972 డిసెంబర్ 21న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు. వైఎస్ జగన్ చదువులో ఎప్పుడు ముందుండేవాడు 1991 నుంచి 94 వరకు బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ గ్రేడు వరకు విద్యనభ్యసించాడు. ఆ తరువాత బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ (బి.కాం) డిగ్రీని హైదరాబాదులోని కోఠీ వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పి.జి. కళాశాలలో పూర్తిచేశారు.
డిగ్రీ పూర్తి అయిన తరువాత లండన్ వెళ్లి అక్కడ ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బెంగళూరులో తన సొంత కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చేశాడు. ఈ క్రమంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి న్యూస్ ఛానల్ , తండూరు జల విద్యుత్ ప్రాజెక్టును స్థాపించారు. ఈ క్రమంలోనే 1996 ఆగస్టు 28న పులివెందులలో భారతీ గారి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరూ పిల్లలు.
undefined
రాజకీయ జీవితం
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వైయస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2009 జనరల్ ఎలక్షన్స్ లో కడప ఎంపీగా పార్లమెంటుకు పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించాలని సాధించారు. వైఎస్ జగన్ ..ఎంపీగా పలు అభివృద్ధి పనులు చేస్తూ అనతికాలంలోనే ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో 29 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ వార్త కేవలం వైఎస్ జగన్ నే కాదు.. అనేకమంది ప్రజల గుండెలు ఆగిపోయాయి. జగన్ తన తండ్రి మరణి తట్టుకోలేక చనిపోయిన వారందరి కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు.
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఆయన బాటలోనే నడిచిన జగన్ రోజురోజుకు ప్రజల్లో ఒక్కడిగా మారిపోయారు. ఈ ఓదార్పు యాత్రలో జగన్ కు వేలాది మంది ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా.. అతని వెంట వేలాది మంది మద్దతుగా నిలిచారు. తరువాత సీఎంగా జగన్ ను నియమించాలని ఎంత డిమాండ్ వచ్చినా అప్పటి కాంగ్రెస్ మాత్రం పట్టించుకోలేదు. తొలుత రోషయ్యను ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డిలకు సీఎం బాధితులు అప్పగించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన
ఇక కిరణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన నాలుగు రోజులకే అంటే.. 2010 అక్టోబర్ 29న జగన్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలో ఎంతో మందితో చర్చించి.. 2011 మార్చి 11న ఇడుపులపాయలను తన తండ్రి సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీని అఫీషియల్ గా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ పదహారు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది. పార్టీ పెట్టిన అనతికాలంలోనే వైఎస్ జగన్ కి మంచి రిజల్స్ వచ్చింది.
అక్రమాస్తుల కేసులో అరెస్ట్
ఇదిలా ఉంటే.. 2012 మే 27న అక్రమాస్తుల కేసులో జగన్ ని సిబిఐ అరెస్టు చేసింది. వివిధ కేసుల్లో భాగంగా జగన్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 16 నెలలు కూడా జైల్లో శిక్ష అనుభవించారు. మొత్తానికి 2013 సెప్టెంబర్ 23న సిబిఐ కోర్టు కొన్ని షరతులు విధిస్తూ జగన్ కు బెయిల్ మంజూరు చేస్తుంది.జగన్ జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు షర్మిల రాష్ట్రమంతా పర్యటించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేశారు. 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు కొత్త రాష్ట్రాల ఏర్పడ్డాయి. ఈ తరుణంలో 2014 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టిడిపి వైఎస్ఆర్సిపి ముఖ్య పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగ్గగా.. టిడిపి పార్టీ 102 సీట్లు గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ముఖ్యమంత్రిగా
మరోవైపు.. ప్రజాసంకల్ప యాత్ర మొదలుపెట్టాడు. మొత్తంగా 341 రోజులపాటు ఈ సంకల్పయాత్ర సాగింది సంకల్ప యాత్రలో భాగంగా 3648 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రతి పల్లె పల్లె తిరిగారు. ప్రజా సమస్యలపై వివిధ రంగాల నాయకులతో చర్చించారు చూస్తుండగానే 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో జగన్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు తన ప్రత్యేకమైన ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లాడు కానీ ఈసారి ఎన్నికల్లో ప్రజలు జగన్ నమ్మి అధికారాన్ని అప్పగించారు.ఈ ఎన్నికల్లో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది.
ఇలా 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాడు. జగనన్న అమ్మ ఒడి, నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో మంచి గుర్తింపు పొందాడు. అలాగే..
నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు.
నెట్ వర్త్
2023 ఏప్రిల్ నాటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం అతను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి, మొత్తం ఆస్తులు 510 కోట్లు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోడేటా
పూర్తి పేరు: వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
పుట్టిన తేదీ: 21 Dec 1972 (వయస్సు 52)
పుట్టిన ప్రాంతం: గ్రామం. పులివెందుల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
పార్టీ పేరు : Yuvajana Sramika Rythu Congress Party
విద్య: ఎంబీఏ
వృత్తి: వ్యాపారవేత్త, మీడియా వ్యాపారం మరియు రాజకీయ నాయకుడు
తండ్రి పేరు: వై.ఎస్. రాజశేఖర రెడ్డి
తల్లి పేరు: వై.ఎస్. విజయమ్మ
జీవిత భాగస్వామి పేరు: వై.ఎస్. భారతీ
మతం: హిందూ
శాశ్వత చిరునామా: డోర్ నెం. 3-9-77, పులివెందుల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రస్తుత చిరునామా: 177/1 గ్రామం. కట్టిగనహళ్లి, బెంగళూరు, బృందావన్ కాలేజీ మెయిన్ రోడ్, యలహంక, బెంగళూరు-500064, కర్ణాటక