Etela Rajender Biography:తెలంగాణ ఉద్యమంలో ఆయనో కెరటం.. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన్ని అల్లాడించే వాక్చాతుర్యం ఆయన సొంతం.. ప్రజల కోసం కొట్లాడే నైజం.. ప్రజా శ్రేయస్సే ఆయన లక్ష్యం.. నిత్యం ప్రజల సేవ చేయాలనేదే ఆయన ఆరాటం.. ప్రజల కోసం పోరాటం చేస్తూ.. జన హ్రుదయాలను గెలిచిన నేత. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీ రాసుకున్నారు. ఆయనే తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాజకీయ దురంధరుడు ఈటెల రాజేందర్. ఆయన రాజకీయ ప్రస్థానం మీకోసం..
Etela Rajender Biography: తెలంగాణ ఉద్యమంలో ఆయనో కెరటం.. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన్ని అల్లాడించే వాక్చాతుర్యం ఆయన సొంతం.. ప్రజల కోసం కొట్లాడే నైజం.. ప్రజా శ్రేయస్సే ఆయన లక్ష్యం.. నిత్యం ప్రజల సేవ చేయాలనేదే ఆయన ఆరాటం.. ప్రజల కోసం పోరాటం చేస్తూ.. జన హ్రుదయాలను గెలిచిన నేత. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీ రాసుకున్నారు. ఆయనే తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాజకీయ దురంధరుడు ఈటెల రాజేందర్. ఆయన రాజకీయ ప్రస్థానం మీకోసం..
బాల్యం , విద్యాభ్యాసం
1964 మార్చి 20న కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ లో ఈటల రాజేందర్ జన్మించారు. తండ్రి పేరు పెద్ద మల్లయ్య . అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కూడా. బాల్యంలో హస్టల్ లో ఉంటూ విద్యాభ్యాసం చేశారు. హైద్రాబాద్ లో కాలేజీ విద్యాభ్యాసం చేసే సమయంలో లెఫ్ట్ విద్యార్థి సంఘంలో రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. 1984లో ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఆయన బీఎస్‌సీ పట్టా పొందారు.
బిఎస్సి పూర్తయ్యాక రెండు సంవత్సరాలు చిన్న వ్యాపారం చేశారు. అప్పుడే పౌల్ట్రీ గురించి తెలుసుకున్నారు. 1986లో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈటల రాజేందర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జమునను (Etela jamuna)వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు సంతానం. రాజేందర్ రాజకీయాల్లో చేరిన తర్వాత ఆయన సతీమణి జమున పౌల్ట్రీ వ్యాపారాలు చూసుకుంటున్నారు.
రాజకీయ జీవితం
ఈటెల రాజేందర్ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో అడుగుపెట్టారని చెప్పాలి. 1969 లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.1969 ఉద్యమం తర్వాత 1972లో పిడిఎస్ లో చేరారు అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. అందులో ఆయన చాలా చురుకగా పనిచేశారు.
2003లో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈటల రాజేందర్ తొలిసారి 2004 ఎలక్షన్లో కమలాపూర్ నుండి పోటీ చేశారు. ఆయన సమీప అభ్యర్జి టిడిపి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ముద్దసాని దామోదర్ రెడ్డి కమలాపూర్ నియోజకవర్గం నుండి 1983లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టిడిపి పార్టీలో చేరారు 1985 నుండి వరుసగా టిడిపి తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
చంద్రబాబు కేబినెట్లో మినిస్టర్ గా కూడా చేశారు. అలాంటి వ్యక్తిని మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడి 68,393 ఓట్లు సాధించి 1963 ఓట్ల మెజారిటీతో ఓడించే సరికి ఈటల రాజేందర్ పేరు కరీంనగర్ జిల్లా అంతా వ్యాపించింది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ అత్యధిక మెజారిటీతో గెలిచారో అప్పటి నుంచి కేసీఆర్ కి ముఖ్య శిష్యుడుగా మారిపోయారు.
2009 సార్వత్రిక ఎన్నికల్లో కమలాపూర్ నుంచి కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయించాడు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమోహన్ రావుపై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో 56,752 ఓట్లు సాధించారు రాజేందర్. అయితే 2009లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, 2009 సెప్టెంబర్ 2న వైయస్ మరణించడంతో కెసిఆర్ కి రెక్కలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. ఈ సమయంలో కరీంనగర్ నుండి ఈటల రాజేందర్ ముందుండి ఉద్యమాన్ని నడిపించారు.
తెలంగాణ వచ్చాక టిఆర్ఎస్ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి సుదర్శన్ రెడ్డి పై ఏకంగా 57,307 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి ఆయన విజయం సాధించారు. 2018 వరకు బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. రెండో దఫా కూడ కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ కు మంత్రి పదవి దక్కింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కేసీఆర్ కేటాయించారు.
బీజేపీలో చేరిక..
ఈటెల రాజకీయ జీవితంలో ఊహించని మలుపు.. 2021లో ఈటల రాజేందర్ పేదల భూములను ఆక్రమించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ విషయమై విచారణకు కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 2021 మే 1న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేశారు . అలా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగా 2021లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
2021 అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా మరోసారి హుజూర్ నగర్ నుండి మరోసారి బరిలోకి దిగారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి కూడ ఈటల రాజేందర్ పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. బీజేపీ నాయకత్వం 2023లో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ పదవిని కేటాయించింది.
ఈటెల రాజేందర్ బయోడేటా
పూర్తి పేరు: ఈటెల రాజేందర్
పుట్టిన తేది: 20 మార్చి 1964 (వయస్సు 60)
పుట్టిన స్థలం: కరీంనగర్
పార్టీ పేరు: బీజేపీ
చదువు: బీఎస్సీ
తండ్రి పేరు: పెద్ద మల్లయ్య
తల్లి పేరు:
జీవిత భాగస్వామి పేరు: ఇ జమున
శాశ్వత చిరునామా: 9-72, కమలాపూర్ గ్రామం & మండలం, కరీంనగర్ జిల్లా