చంద్రబాబునాయుడు : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, 

By Rajesh Karampoori  |  First Published Mar 13, 2024, 2:32 AM IST

Nara Chandrababu Naidu Biography: సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాలలో సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం గల నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధితుల స్వీకరించి రికార్డు క్రియేట్ చేశారు. ఆయన ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు


Nara Chandrababu Naidu Biography: సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాలలో సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం గల నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధితుల స్వీకరించి రికార్డు క్రియేట్ చేశారు. ఆయన ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు

 బాల్యం, విద్యాభ్యాసం 

Latest Videos

undefined

చంద్రబాబు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. చంద్రబాబు తండ్రి నారా ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు తల్లి అమ్మ‌ణ్ణ‌మ్మ‌ గృహిణి. చంద్రబాబు స్వంత ఊరిలో పాఠశాల లేకపోవడంతో ఆయన ఐదవ తరగతి వరకు శేషాపురంలోని ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి 1972లో BA డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరువాత..  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. 1974లో ప్రొఫెసర్ డాక్టర్. DL నారాయణ మార్గదర్శకత్వంలో తన Ph.D.ని ప్రొఫెసర్ NG రంగా ఆర్థిక ఆలోచనలు అనే అంశంపై  చేయాలని భావించారు. కానీ, రాజకీయాలపై ద్రుష్టిపెట్టడంతో అతని Ph.D పూర్తి చేయలేదు.

రాజకీయ జీవితం

 విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. ఇక చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గ నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  ఆనాటి సీఎం అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.1980- 1983 వరకు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తారు. అదే సమయంలో 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు.  వారికి ఓ కుమారుడు లోకేష్. 

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది టీపీడీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం  మమా నందమూరి రామారావు పిలుపు మేరకు చంద్రబాబు తెలుగుదేశం  పార్టీ (టీడీపీ)లో చేరారు. ప్రారంభంలో చంద్రబాబు నాయుడు పార్టీ పనులు, శిక్షణా శిబిరాలను నిర్వహించడం, సభ్యత్వ రికార్డులను కంప్యూటరీకరించడంలో నిమగ్నమయ్యాడు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణంగా ప్రభుత్వంలో 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో అతను క్రియాశీల పాత్ర పోషించాడు . ఎన్టీఆర్ 1986లో నాయుడుని TDP ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

1989 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పోటీ చేసి 5 వేల ఓట్లతో గెలుపొందారు. అయితే INC ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఆయన ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.  మరోవైపు.. ఎన్టీ రామారావు అతన్ని TDP సమన్వయకర్తగా నియమించారు, ఆ హోదాలో అతను అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఇక 1994 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.

ఏపీ సీఎంగా (1995–2004) 

1 సెప్టెంబర్ 1995 న చంద్రబాబు నాయుడు..ఎన్టీ రామారావు నాయకత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైన తిరుగుబాటు తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి వివాదాస్పద పాత్ర కారణంగా అంతర్గత తిరుగుబాటు చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు మెజారిటీ శాసనసభ్యుల మద్దతును పొందగలిగారు. దీంతో ఎన్టీఆర్ ను గద్దే దించి.. చంద్రబాబు అధికారం చేపట్టాడు. ఇక ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబుకి దక్కింది.
 
1999 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో  చంద్రబాబు నాయుడు తన పార్టీని విజయపథంలో నడిపించారు. రాష్ట్ర అసెంబ్లీలోని 294 సీట్లలో 180 స్థానాలు సాధించారు.అదనంగా పార్లమెంటు ఎన్నికలలో 42 స్థానాలకు గాను 29 స్థానాలను TDP గెలుచుకుంది. దీంతో BJP మిత్రపక్షాలలో అతిపెద్ద పార్టీగా, లోక్‌సభలో నాల్గవ అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, బలమైన ఎన్నికల ఆదేశాన్ని పొందిన మొదటి ఆర్థిక సంస్కర్తగా మీడియా ఆయనను కీర్తించింది. 

ఇక చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో అమెరికా అధ్యక్షుడు, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చారు. భవిష్యత్ అవసరాలు సమస్యలు ముందే గుర్తించిన చంద్రబాబు  విజన్ 2020 పేరుతో ఓ ప్రణాళికను రూపొందించాడు. దీని అమలుకు పలు అంతర్జాతీయ సంస్థలతో కొన్ని ప్రతిపాదనలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలను ప్రారంభించాడు.  ఇలా జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయడంలో విజయం సాధించారు చంద్రబాబు. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకొన్న ఆయన 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి ఆనతి కాలంలోనే ఐటి రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిపారు.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర 

ఢిల్లీలో కాంగ్రెసేతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో (1996-2004)చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం గమనార్హం. 1996 పార్లమెంటరీ ఎన్నికల తరువాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్ పాత్రను స్వీకరించారు. 13 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి (1996 -1998) హెచ్‌డి దేవెగౌడ, తరువాత ఐకె గుజ్రాల్ ను ప్రధాన మంత్రులు చేయడంలో ఆయన కీలక పాత్ర నాయకత్వం వహించారు. ఆ రెండుసార్లు చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి.  కానీ, చంద్రబాబు దాన్ని సున్నితంగా నిరాకరించారు.

ఇలా 1999 లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ వ్యవహారాలలో చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత పెరిగింది. వాజ్‌పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వానికి టీడీపీ  29 మంది ఎంపీల మద్దతును అందించింది .  వాజ్‌పేయి ..టీడీపీకి ఎనిమిది క్యాబినెట్ బెర్త్‌లను ఆఫర్ చేసినప్పటికీ.. చంద్రబాబు కేంద్ర మంత్రివర్గం నుండి దూరంగా ఉండి, NDA ప్రభుత్వానికి బాహ్య మద్దతును అందించిందని పేర్కొన్నారు. 

ప్రతిపక్ష నాయకుడు (2004–2014) 

 ఇక 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు పేల్చి చంద్రబాబు నాయుడు పై హత్య ప్రయత్నం చేశారు.  కానీ, అదృష్టవ సర్దు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రెండుసార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాత 2004లో జరిగిన మద్యంత్ర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది.  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల్లో రెండింటిలోనూ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ 185 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ 47 సీట్లును కైవసం చేసుకుంది. ఆ పార్టీ ఎన్నికల చరిత్రలోనే అత్యల్పంగా నిలిచింది. అటు పార్లమెంట్‌లో 42 స్థానాలకు గానూ టీడీపీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 

2009 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలను త్రిముఖ పోటీగా మార్చడంతో నాయుడు మరో సవాలును ఎదుర్కొన్నారు . ఈసారి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ మరోసారి అధికార కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయింది. అసెంబ్లీలో టీడీపీకి 92 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 156 సీట్లు వచ్చాయి. చిరంజీవి ప్రజారాజ్యం 18 స్థానాల్లో విజయం సాధించింది. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం తన పార్టీ పరాజయానికి కారణమని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014లో జరిగిన  సార్వత్రిక ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ విజయం  సాధించింది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సిపి చేతిలో ఓడిపోయింది.  ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంటు స్థానాలకు గాను మూడు స్థానాలలో విజయం సాధించింది.  ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ చాణకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.  

నారా చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ 

పూర్తి పేరు: నారా చంద్రబాబు నాయుడు
పుట్టిన తేదీ: 20 Apr 1950 (వ‌య‌స్సు  74)
పుట్టిన ప్రాంతం: చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్
పార్టీ పేరు    : Telugu Desam
విద్య: Post Graduate
వృత్తి: రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు: ఖ‌ర్జూర నాయుడు
తల్లి పేరు: అమ్మ‌ణ్ణ‌మ్మ‌
జీవిత భాగస్వామి: నారా భువ‌నేశ్వ‌రి


 
 

click me!