నిషేధిత పవిత్ర స్థలంలో షూటింగ్.. యూట్యూబర్ అరెస్ట్...

Published : Nov 15, 2021, 09:18 AM IST
నిషేధిత పవిత్ర స్థలంలో షూటింగ్.. యూట్యూబర్ అరెస్ట్...

సారాంశం

పురాణేతిహాసాల ప్రకారం నిధివన్ రాజ్ అనేది రాధాకృష్ణుల ‘రాస లీలలు’ ఆడుకునే పవిత్ర స్థలం. ఇప్పటికీ రాత్రి పూట రాధా, శ్రీకృష్ణుడు అక్కడికి వస్తారని, రాత్రిపూట రాధా..  శ్రీకృష్ణుడు 'raas lila' లు ఆడతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

మథుర : యూపీలోని బృందావన్‌లో ఓ యూట్యూబర్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బృందావన్‌లో రాత్రి సమయంలో వీడియో చిత్రీకరణ నిషేధించబడిన ముఖ్యమైన మతపరమైన ప్రదేశం "నిధివన్ రాజ్" లోపల వీడియోను చిత్రీకరించినట్లు అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేరానికి గాను యూట్యూబ్ ఛానెల్ అడ్మిన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

చారిత్రక ప్రదేశాలు, పురాణేతిహాసాలకు సంబంధం ఉన్న ప్రదేశాల్లో చాలాసార్లు ప్రభుత్వాలు షూటింగులకు అనుమతినివ్వరు. అక్కడి వాతావరణం డిస్ట్రబ్ అవుతుందని, షూటింగ్ కోసం పరిసరాలను పాడు చేస్తారని కారణాలు చెబుతాయి. అలాగే Nidhivan Rajలో కూడా రాత్రివేళ షూటింగ్ చేయడం, చిత్రీకరణ నిషేధం.

కారణం ఏంటంటే.. పురాణేతిహాసాల ప్రకారం నిధివన్ రాజ్ అనేది రాధాకృష్ణుల ‘రాస లీలలు’ ఆడుకునే పవిత్ర స్థలం. ఇప్పటికీ రాత్రి పూట రాధా, శ్రీకృష్ణుడు అక్కడికి వస్తారని, రాత్రిపూట రాధా..  శ్రీకృష్ణుడు 'raas lila' లు ఆడతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఆ సమయంలో ఎవరూ నిధివన్ రాజ్ లోకి ప్రవేశించడానికి అనుమతించబడరు.

బర్రె పాలు ఇవ్వడం లేదని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన రైతు.. ఆయన ఫిర్యాదు వింటే షాక్

ఈ నేరానికి పాల్పడినందుకు గానూ Gauravzone అనే యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తున్న గౌరవ్ శర్మను ఢిల్లీలోని అతని నివాసంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు "Gaurav Sharmaను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీంతోపాటు అతని సహచరులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని పోలీసు అధికారి మార్తాండ్ ప్రకాష్ సింగ్ తెలిపారు.

విచారణలో, శర్మ తన బంధువు ప్రశాంత్, స్నేహితులు మోహిత్, అభిషేక్‌లతో కలిసి నవంబర్ 6 రాత్రి holy placeలో వీడియోను చిత్రీకరించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.శర్మ నవంబర్ 9న youtubeలో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. 

అయితే, ఈ వీడియోను చూసిన భక్తులు అథారిటీకి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో "పవిత్ర" స్థలంలో చిత్రీకరణపై పూజారులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అతను ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాల్సి వచ్చింది.

ప్రియుడితో వెళ్లిపోయిందని.. యువతికి గుండు కొట్టించి..

నిధివన్ రాజ్ పూజారి రోహిత్ గోస్వామి ఫిర్యాదు మేరకు బృందావన్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 295A,  IT చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేలో తన కుక్కకు బెలూన్లు కట్టి ఎగరేసి, ఆ వీడియోను తన ఛానల్ లో అప్ లోడ్ చేసినందుకు అరెస్టయిన అదే యూట్యూబర్ ఈ శర్మ. 

ఆ తరువాత విడుదలైన ఈ యూట్యూబర్ తన ఛానల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేసి, తన చర్యకు క్షమాపణలు చెప్పాడు. శర్మ డాలర్‌ అనే తన కుక్కకు బెలూన్‌లకు కట్టి గాలిలో తేలేలా చేసి ఆ వీడియోను తన ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. దీనిమీద జంతు ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu