
చెన్నై: యూట్యూబర్ మదన్ కుమార్ బ్యాంకు ఖాతా నుండి పోలీసులు రూ. 4 కోట్లను సీజ్ చేశారు. పబ్‌జీ గేమ్ ఆడుతూ మహిళలతో అసభ్యంగా మాట్లాడేవాడు. ఈ తరహా ఆడియో, వీడియోలతో మదన్ కోట్లు సంపాదించాడు. మదన్ తో పాటు ఆయన భార్యను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మదన్ కీలక విషయాలను వెల్లడించారని సమాచారం. మదన్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్ కు 18 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు.
also read:లైవ్ లో అశ్లీల సంభాషణలు, అసభ్యప్రవర్తన.. యూట్యూబర్ జంట అరెస్ట్...
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురికి చెందిన మదన్ కుమార్ యూట్యూబ్ ద్వారా టీనేజ్ యువతులను ఆకర్షించేవాడు. మదన్ కుమార్ పై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.మదన్ కు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలను ఆయన భార్య కృత్తిక ఆపరేట్ చేస్తోంది. ఈ బ్యాంకు ఖాతాల నుండి రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.మదన్ ఇంటి నుండి బీఎండబ్ల్యు కారు ను కూడ స్వాధీనం చేసుకొన్నారు.
ఈ కేసు విషయమై మదన్ తండ్రి మాణికం ను కూడ పోలీసులు విచారిస్తున్నారు. సేలంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మదన్ కుటుంబంతో చెన్నైలో స్థిరపడ్డాడు. మదన్ తండ్రి చెన్నైలోని అంబట్టూరు వద్ద రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో పరిచయమైన కృత్తికతో మదన్ ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు 8 ఏళ్ల చిన్నారి ఉన్నాడు. యూట్యూబ్ చానెల్ ద్వారా మదన్ నెలకు రూ. 3 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.