తన కుటుంబ సభ్యులును నలుగురిని చంపేసి, శవాలని ఇంట్లో పూడ్చిపెట్టాడు

Published : Jun 20, 2021, 07:54 AM IST
తన కుటుంబ సభ్యులును నలుగురిని చంపేసి, శవాలని ఇంట్లో పూడ్చిపెట్టాడు

సారాంశం

పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన నాలుగు నెలల తర్వాత వెలుగు చూసింది. ఓ యువకుడు తన కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. నేరం జరిగిన నాలుగు నెలల తర్వాత ఆ సంఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన కుటుంబంలోని నలుగురిని పాశవికంగా హత్య చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇంటర్ చదువుతున్న 19 ఏళ్ల ఆసిఫ్ మొహమ్మద్ ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

నాలుగు నెలల క్రితం ఆసిఫ్ తన తల్లిదండ్రులను, సోదిరిని, 62 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేశాడు. అయితే, ఆ సంఘటన నుంచి నిందితుడు ఆసిఫ్ సోదరుడు ఆరిఫ్ మొహమ్మద్ తప్పించుకున్నాడు. తన సోదరుడిని నేరాన్ని బయటపెట్టాలని అతను నిర్ణయించుకోవడంతో సంఘటన వెలుగు చూసింది. సంఘటనపై కాలియాచోక్ పోలీసు స్టేషన్ లో అతను ఫిర్యాదు చేశాడు. 

ఫిబ్రవరి 28వ తేదీన ఆసిఫ్ కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. దాన్ని సేవించిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు దాంతో వారిని హత్య చేసి ఇంటి ఆవరణలోనే శవాలను పూడ్చిపెట్టాడు. పోలీసులు ఆసిఫ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. 

ఇంటి నుంచి బయటకు వెళ్తే చంపేస్తానని ఆసీఫ్ తన సోదరుడు ఆరిఫ్ ను బెదిరించాడు. దాంతో ఆరిఫ్ మొహ్మద్ మాల్దా నుంచి తప్పించుకుని పారిపోయాడు. మాల్దాకు తిరిగి వచ్చి అతను సోదరుడిపై ఫిర్యాదు చేశాడు. ఆసిఫ్  వేర్ హౌస్ వాల్ లో పెద్ద రంధ్రం తవ్వి బేస్ మెంట్ లో శవాలను పూడ్చిపెట్టాడు. అనుమానం వస్తుందనే ఉద్దేశంతో పని మనిషిని ఇంట్లోకి రానివ్వలేదు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?