యూపీలోని నోయిడాలో ఓ కాన్వాయ్ శ్రేణి వేగంగా వెళ్తోంది. అందులో పలు వాహనాల్లో నుంచి యువకులు నోట్లను రోడ్లపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుధ్ నగర్ జిల్లా నోయిడాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. మనీ హీస్ట్ వెబ్ సిరీస్ లో చూపించిన విధంగా కదులుతున్న కారులో నుంచి కరెన్సీ నోట్లు బయటకు వెదజల్లారు. నోయిరా రోడ్లపై కాన్వాయ్ సిరీస్ లోని కార్లలో ఉన్న యువకులు ఈ చర్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా సిటీలోని అత్యంత రద్దీగా ఉండే రహదారిపై కాన్వాయ్ సిరీస్ లోని పలు వాహనాలు ఇటీవల వెళ్లాయి. అవన్నీ సెక్టార్ -37 నుండి సిటీ సెంటర్ వైపు వెళ్తున్నాయి. అందులో ఓ వాహనంలో యువకులు కిటీకిలపై కూర్చొని వెళ్తున్నారు. మరో వాహనంలోని పలువురు యువకులు నోట్లను వెదలజల్లారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడున్న పలువురు రికార్డు చేశారు.
में जमकर उड़ाई जा रही है यातायात नियम नियमों की धज्जियां
क़ाफ़िला पैसे उड़ाते हुए , ट्रैफ़िक उल्लंघन
दर्जनों से ज़्यादा गाड़िया का काफिला वीडियो वायरल
थाना 39 pic.twitter.com/HpB42kqWgA
7 సెకన్ల ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ కాన్వాయ్ లో ఉన్న ఐదు వాహనాలను సీజ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరో ఐదు వాహనాల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. వారిపై కూడా సోదాలు జరుగుతున్నాయి. అన్ని వాహనాలకు రూ.33 వేల చలాన్ వేసినట్టు పోలీసులు వెల్లడించారు.
అలాగే వాహనాల్లో ఉన్న నిందితులపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్య ఇంకా తెలియరాలేదు. అయితే వాహనాల్లో నుంచి వెలువడింది నకిలీ నోట్లా ? అసలైన నోట్లా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాన్వాయ్‌లోని వాహనాల్లో ఉన్న వారంతా పెళ్లికి వెళ్తున్నారని తెలుస్తోంది.