యువకుడిపై ఐదురుగు వ్యక్తుల దాడి.. చెవి పగలగొట్టి, హింసించి, అసభ్యకరవీడియో చిత్రీకరించి.. ట్విస్ట్ ఏంటంటే..

By SumaBala BukkaFirst Published Nov 7, 2022, 12:23 PM IST
Highlights

చిన్న గొడవ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. వినికిడి లోపం ఏర్పడేలా చేసింది. చివరికి వారి అసభ్యకరమైన వీడియో వైరల్ కావడంతో కేసు నమోదయ్యింది. 

భోపాల్ : భోపాల్ లోని టీటీ నగర్ ప్రాంతంలో చిన్న గొడవ విషయమై ఐదుగురు పాత నేరస్తులు ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని మీద దాడిచేసి, అతని దగ్గరున్నదంతా దోచకున్నారు. అతడితోపాటు ఉన్న స్నేహితురాలిని లైంగికంగా వేధించారు. వారి దెబ్బలకు యువకుడి ఒక చెవి పనిచేయడం మానేసింది. అంతేకాకుండా.. ఆ యువకుడిది, అతని స్నేహితుడిది అసభ్యకరమైన వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 18న చోటు చేసుకుంది. 

అయితే,  వీడియో వైరల్ కావడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ ఐదుగురిపై దోపిడీ, దాడి కేసు నమోదు చేశాడు. ఈ కేసులో బాధితుడు అక్టోబ‌ర్ 31న నిందితుల్లో ఒక‌రి పరిచయస్తులతో ఇలాగే వ్యవహరించిన విషయం కూడా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో టీటీ న‌గ‌ర్ పోలీసులు నేర‌గాళ్ల‌పై కౌంట‌ర్ కేసులు న‌మోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసు విచారణాధికారి ఎస్‌ఐ సునీల్ కుమార్ రఘువంశీ  తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు టీటీ నగర్‌లో నివాసముంటున్న్నాడు. ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. అరెస్ట్ చేసిన పోలీసులు..

అక్టోబరు 17న తాను స్నేహితుడితో కలిసి టీటీ నగర్‌లోని పాఠశాల దగ్గర నిలబడి ఉండగా నిందితులు తిలక్, సచిన్, అజ్జు, ఇద్దరు మైనర్లు తమ వద్దకు వచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక ముఖ్యమైన విషయం చర్చించడానికి తిలక్ ఇంటి డాబా మీదకు రావాలని కోరారు. వారు వెళ్లగా, మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడికి చిన్న విషయంపై వీరిపై కోపం వచ్చింది. దీంతో ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడు క్షమాపణలు చెప్పడంతో, నిందితులు వారిపై రాడ్‌లతో దాడి చేసి వారి బట్టలు చింపేశారు. 

ఆ తరువాత రూ. 5000 చెల్లించాలని అడిగారు. లేకుంటేఅసభ్యకర వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తామని అతనిపై ఒత్తిడి తెచ్చారు. "నిందితులు మా జేబులో వెతికారు. డబ్బులు దొరకకపోవడంతో.. ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయాలని బలవంతం చేశారు. అంతేకాదు, నిందితుడు సచిన్ ఫిర్యాదుదారుడి ఫోన్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో రూ. 5000 బదిలీ చేసుకున్నాడు. ఆ తరువాత వారి అసభ్యకరమైన వీడియోను రికార్డ్ చేసాడు" అని ఎస్‌ఐ రఘువంశీ తెలిపాడు. ఆ తరువాత కొద్ది రోజులకు వారినుంచి రూ.10,000 డిమాండ్ చేసి, ఇవ్వకపోవడంతో వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేయడంతో శనివారం వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.

అయితే, ఫిర్యాదుదారుడు, అతని స్నేహితులు నిందితుడికి తెలిసిన వారితో అదే పని చేసినట్లు విచారణలో తేలింది. 20 ఏళ్ల యువకుడి ఫిర్యాదు మేరకు రాహుల్, అతని ఐదుగురు స్నేహితులపై టీటీ నగర్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ, అశ్లీల వీడియో రికార్డ్ కేసు కూడా నమోదైంది. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ శనివారం కేసు నమోదైంది. నిందితులు సాధారణ నేరస్థులు కావడంతో అతనిపై హత్యాయత్నం, ఆయుధ చట్టం వంటి కేసులు నమోదయ్యాయి. నిందితుడు అజ్జూ హత్యాయత్నం ఆరోపణలపై ఇప్పటికే జైలులో ఉన్నాడు.

click me!