భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Published : Nov 07, 2022, 11:42 AM ISTUpdated : Nov 07, 2022, 11:46 AM IST
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. అరెస్ట్ చేసిన పోలీసులు..

సారాంశం

భార్య నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని ధార్ లో ఓ వ్యక్తి మృతి కేసులో అతడి భార్య పైనే పోలీసులు నేరం మోపారు. కొన్ని రోజులుగా ఆ మహిళ తన భర్తను వేధిస్తోంది. దీంతో మనస్తాపం చెందిన భర్త నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ధార్లోని ఘటా బిలోద్ కు చెందిన దిలీప్ 40 అనే వ్యక్తి గత నెల 10వ తేదీన ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.
  
దిలీప్ మృతికి అతని భార్య రింకూ కారణమని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రింకూను విచారణకు పిలిపించారు. విచారణలో ఆమె నిజాలు వెల్లడించింది. భూమి విషయంలో తనకు భర్తతో వివాదం చెలరేగిందని, వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మి  డబ్బులు తీసుకురావాల్సిందిగా తను కోరానని, అందుకు భర్త అంగీకరించలేదని తెలిపింది.

భూమి విషయమై తన కొడుకు రింకూతో ప్రతీరోజు గొడవ పడేదని, ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అంటూ తిట్టిందని కూడా కొడుకు తనతో చెప్పుకుని బాధపడ్డారని దిలీప్ తండ్రి పోలీసులకు చెప్పాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు తన వేదనను తమతో పంచుకున్నాడు అని తెలిపాడు.  చివరకు నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపుల వల్లే దిలీప్ చనిపోయాడని తేలడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల వాంగ్మూలాలను తీసుకున్నారు.

దారుణం.. సోదరిని, ఆమె ప్రియుడిని కొట్టి.. గొంతుకోసం.. రక్తమోడుతున్న కత్తితో పోలీస్ స్టేషన్ కు...

ఇదిలా ఉండగా, వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శివమొగ్గ నగరం అశ్వత నగరలోని 5క్రాస్ లో ఈ ఘటన జరిగింది.  మృతురాలిని నవ్యశ్రీ (23)గా గుర్తించారు. నవ్యశ్రీకి ఐదు నెలల క్రితమే ఆకాశ్ అనే యువకుడితో పెళ్లయింది. శనివారం సాయంత్రం ఇంటిదగ్గర తులసి పూజ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే, ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో కారు షెడ్ లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. 

కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగానే నవ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని నవ్య శ్రీ కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబానగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకునేదయితే రాత్రి ఆ వీడియో సంతోషంగా ఎలా పోస్ట్ చేసింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ
Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu