రోడ్డు మీదే ప్లాస్టిక్ సర్జరీ... టీవీ సీరియల్ పై ట్రోల్స్...!

Published : Nov 07, 2022, 11:17 AM IST
  రోడ్డు మీదే ప్లాస్టిక్ సర్జరీ... టీవీ సీరియల్ పై ట్రోల్స్...!

సారాంశం

ఎవరో చనిపోయిన అమ్మాయి ముఖాన్ని డాక్టర్ రోడ్డు మీదే ప్లాస్టిక్ సర్జరీ చేసి.. మరో మహిళ ముఖాన్ని పెట్టడం గమనార్హం. చాలా సింపుల్ గా.. ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

కల్పిత కథల ఆధారంగా... టీవీ సీరియల్స్ తెరకెక్కిస్తూ ఉంటారు. సీరియల్స్  లో కొన్ని సంఘటనలు నిజ జీవిత కథల్లో జరిగినట్లుగానే చూపిస్తుంటారు. కానీ... కొన్ని మాత్రం అసలు ఇలాంటి జరగడం సాధ్యమేనా అన్నట్లుగా చేస్తూ ఉంటారు. తాజాగా... ఓ టీవీ సీరియల్ కి సంబంధించిన ఓ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఎవరో చనిపోయిన అమ్మాయి ముఖాన్ని డాక్టర్ రోడ్డు మీదే ప్లాస్టిక్ సర్జరీ చేసి.. మరో మహిళ ముఖాన్ని పెట్టడం గమనార్హం. చాలా సింపుల్ గా.. ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

 

ఈ వీడియో క్లిప్... తమిళ సీరియల్ రోజా నుంచి తీసినదిగా తెలుస్తోంది. సీరియల్‌లోని ఒక స్త్రీ పాత్ర గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నట్లు చూపించారు. అయితే... చనిపోయిన మహిళ ముఖాన్ని మరో మహిళ ముఖంతో రీప్లేస్ చేయడం గమనార్హం. ఈ వీడియోని ట్విట్టర్ లో  ఓ వ్యక్తి నవంబర్ 4వ తేదీన షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఆ సీరియల్ ని ట్రోల్ చేస్తుండటం గమనార్హం. ఆ వీడియోని మీరు కూడా ఓ సారి చూసేయండి. ఈ వీడియోకి నెటిజన్ల కామెంట్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?