350 కి.మీ పరుగెత్తి ఢిల్లీకి చేరిన యువకుడు.. ఆర్మీ‌లో చేరేందుకు యువతలో ఉత్సాహం నింపేందుకు..

Published : Apr 05, 2022, 04:15 PM IST
350 కి.మీ పరుగెత్తి ఢిల్లీకి చేరిన యువకుడు.. ఆర్మీ‌లో చేరేందుకు యువతలో ఉత్సాహం నింపేందుకు..

సారాంశం

భారత సైన్యంలో చేరేందుకు యువతలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఓ యుకుడు.. రాజస్తాన్ నుంచి  పరుగెత్తుకుంటూ ఢిల్లీ చేరుకున్నాడు. దాదాపు 350 కి.మీ పరుగెత్తి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరాడు. 

భారత సైన్యంలో చేరేందుకు యువతలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఓ యుకుడు.. రాజస్తాన్ నుంచి  పరుగెత్తుకుంటూ ఢిల్లీ చేరుకున్నాడు. దాదాపు 350 కి.మీ పరుగెత్తి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరాడు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని 50 గంటల్లో 350 కి.మీ పరుగెత్తాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జంతర్ మంతర్‌కు చేరుకున్న అతడు.. అక్కడ జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నాడు. కోవిడ్ కారణంగా సుమారు 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వందలాది మంది యువకులు జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టారు. అందులో అతడు కూడా పాల్గొన్నాడు.

అతని పేరు సురేశ్ భిచార్. రాజస్తాన్‌కు చెందిన మార్చి 29న తన పరుగు యాత్రను ప్రారంభించాడు. ప్రతి గంటకు 7 కి.మీ దూరం చొప్పున ప్రయాణించాడు. ‘మాములుగా నేను ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభిస్తాను.. ఉదయం 11 గంటలకు ఒక పెట్రోల్ పంప్‌కు చేరుకున్న తర్వాత మాత్రమే ఆపివేసాను. అక్కడ నేను విశ్రాంతి తీసుకున్నాను. సమీపంలోని ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థుల నుండి ఆహారం తీసుకున్నాను’ అని సురేష్ ఏఎన్‌ఐ వార్తా సంస్థకు చెప్పారు. భారత సైన్యంలో చేరేందుకు యువతలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు తాను పరుగులు తీస్తున్నట్లు పేర్కొన్నారు. 

 

ఇండియన్ ఆర్మీలో చేరడం తన అభిమతమని.. అయితే అందులో చేరలేకపోయానని సురేష్ చెప్పాడు. టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) కోసం ప్రిపేర్ అవుతున్నానని తెలిపారు. ‘నాకు 24 సంవత్సరాలు. నేను నాగౌర్ జిల్లా (రాజస్థాన్) నుండి వచ్చాను. రెండేళ్ల నుంచి నియామకాలు జరగడం లేదు. యువతలో ఉత్సాహం పెంచేందుకు పరుగు పరుగున ఢిల్లీకి వచ్చాను’ అని సురేష్ భిచార్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu