‘భాగస్వామి బీఫ్ తినాలని బెదిరించింది’.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

By Mahesh KFirst Published Aug 28, 2022, 6:09 PM IST
Highlights

గుజరాత్‌లో ఓ యువకుడు, యువతి సహజీవనం చేశారు. బీఫ్ తినాలని, లేదంటే చంపేస్తామని ఆ యువకుడిని ఆయన పార్ట్‌నర్, పార్ట్‌నర్ సోదరుడు బెదిరించారు. దీంతో మనస్తాపంతో ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
 

న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న తన భాగస్వామి బీఫ్ తినాలని బలవంతపెట్టిన కారణంగా ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఓ మహిళ, ఆ మహిళ సోదరుడిపై సోదరుడిపై కేసు పెట్టారు. ఈ ఘటన జూన్ 27న గుజరాత్‌లోని ఉడనాలో పటేల్ నగర్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌కు చెందిన రాహుల్ సింగ్.. తల్లి, సోదరితో ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఓ టెక్స్‌టైల్ డైయింగ్ మిల్‌లో పనికి కుదిరాడు. అక్కడే రాహుల్ సింగ్‌కు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లితో చెప్పాడు. కానీ, ఆమె ఆ పెళ్లిని నిరాకరించింది. తల్లి వ్యతిరేకించడంతో ఆయన ఇల్లు వదిలి ఆ అమ్మాయితో సహజీవనం మొదలు పెట్టాడు. తన కుటుంబానికి మొత్తంగానే టచ్‌లో లేకుండా పోయాడు. గుజరాత్‌లో సూరత్‌లోని నివాసం పెట్టాడు.

లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆ అమ్మాయి, ఆమె సోదరుడు తనను బీఫ్ తినాలని టార్చర్ పెట్టారని, బీఫ్ తినకుంటే చంపేస్తామని బెదిరించారని రాహుల్ సింగ్ తన సూసైడ్ లెటర్‌లో రాసుకున్నాడు. ఈ టార్చర్ భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఈ సూసైడ్ లెటర్ తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. తన ఫ్రెండ్ లిస్ట్‌లు యూపీకి చెందిన తన మిత్రులు, ఇతర బంధువులూ ఉండటంతో ఈ ఆత్మహత్య లేఖ వారి కంట పడింది. ఈ విషయం రాహుల్ సింగ్ తల్లి వీణా దేవికి చేరవేశారు.

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వారి కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులు రాహుల్ సింగ్ లివ్ ఇన్ పార్ట్‌నర్ సోనమ్ అలీ, ఆమె సోదరుడు ముక్తార్ అలీలపై కేసు నమోదైంది.

సోషల్ మీడియా సైట్‌లో రాహుల్ సింగ్ సమాచారాన్ని తమకు అందించారని పోలీసులు తెలిపారు. రాహుల్ సింగ్ సూసైడ్ లెటర్ అప్‌లోడ్ చేసిన రోజే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వారు భావిస్తున్నారని అన్నారు. బీఫ్ తినకుంటే వారు తనను చంపేస్తారని బెదిరించినట్టు రాహుల్ సింగ్ సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నాడని వివరించారు. టార్చర్ చేస్తున్నారని చెప్పినా.. దానిని వివరించలేదని పేర్కొన్నారు. రాహుల్ సింగ్, సోనమ్ అలీ కలిసి జీవించారని, కానీ, పెళ్లి చేసుకున్నట్టు తెలిపే పత్రాలేవీ లేవని పోలీసులు తెలిపారు.

click me!