రక్తమోడిన రహదారులు.. గురుద్వారాకు వెళ్తూ ట్రాక్ట‌ర్ ను ఢీకొన్న లారీ.. ఎనిమిది మంది దుర్మరణం 

By Rajesh KFirst Published Aug 28, 2022, 5:11 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని బహేరి కొత్వాలి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. గురుద్వారా భక్తుల‌తో వెళ్తున్న‌ ట్రాక్టర్ ట్రాలీని ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంత్రి మరణించారు.  

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని బహేరి కొత్వాలి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో  వేగంగా  వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా, 15 మందికీ తీవ్ర‌ గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శక్తి ఫారం ప్రాంతంలోని బాస్గర్ గ్రామానికి చెందిన దాదాపు 45 నుంచి 50 మంది భక్తులు సరిహద్దులో ఉన్న ఉత్తమ్‌నగర్ గురుద్వారాకు ట్రాక్ట‌ర్ ట్రాలీలో బ‌య‌లు దేరారు. ఈ క్ర‌మంలో అవుట్‌ పోస్ట్ సమీపంలో ట్రాక్ట‌ర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టిందని, దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడిందని ఎస్పీ దేహత్ బరేలీ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.  

ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్ర‌మాద అనంత‌రం..  ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని.. క్ష‌త్ర‌గాత్రుల‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స్థలంలో క్షతగాత్రులు, మృతుల బంధువుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఇద్ద‌రి పరిస్థితి విషమంగా ఉందనీ, తీవ్రంగా గాయపడిన వారిని బరేలీ జిల్లా బహేరి ప్రభుత్వ ఆసుపత్రి త‌ర‌లించారు.

click me!