పెళ్లి చేసుకోవాలని కాలేజ్‌ స్నేహితురాలకు వేధింపులు.. ఆమెకు మరోవ్యక్తితో పెళ్లి జరిగిన మారని తీరు.. చివరకు..

By Sumanth KanukulaFirst Published Aug 28, 2022, 5:22 PM IST
Highlights

మహారాష్ట్రలోని థానేకు చెందిన 41 ఏళ్ల వ్యాపారవేత్తను అతనికి పరిచయం ఉన్న వ్యక్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఖార్ సబ్‌వే వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 

మహారాష్ట్రలోని థానేకు చెందిన 41 ఏళ్ల వ్యాపారవేత్తను అతనికి పరిచయం ఉన్న వ్యక్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఖార్ సబ్‌వే వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మృతుడిని పర్వేజ్ బషీర్ షేక్‌గా గుర్తించారు. నిందితుడిని శాంతాక్రూజ్‌లోని గోలీబార్ నగర్‌లో నివాసం ఉంటున్న అకీల్ సయ్యద్‌గా తేల్చారు. బషీర్ అతని భార్య షాజహాన్‌ను వేధిస్తున్నాడని.. నిందితుడు అకీల్‌ సయ్యద్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే తనను ఎదరించిన బషీర్‌ను సయ్యద్‌ హత్య చేశాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాజహాన్, సయ్యద్ కలిసి కాలేజీలో చదవుకున్నారు. అప్పటి నుండి ఆమెను సయ్యద్ వేధిస్తున్నాడు.  అయితే ఆమె పర్వేజ్ బషీర్ షేక్‌ను పెళ్లి చేసుకుంది. మరోవైపు సయ్యద్ కూడా వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ సయ్యద్..  షాజహాన్‌ను వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. అతన్ని పెళ్లి చేసుకోవవాలని కోరుతూ వెంబడించేవాడు. అయితే పర్వేజ్‌ను పెళ్లి చేసుకున్న షాజహాన్.. సయ్యద్‌ను నిరాకరిస్తూనే వచ్చింది. అయితే తనను పెళ్లి చేసుకుంటే షాజహాన్ భర్తను చంపేస్తానని ఆమెను సయ్యద్ గతంలో బెదిరించాడు. అయితే షాజహాన్.. అతడి బెదిరింపులను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని షాజహాన్ తన భర్త పర్వేజ్‌కు చెప్పింది. 

ఈ విషయంలో పర్వేజ్, సయ్యద్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. అయితే ఈ గొడవను ముగించాలని పర్వేజ్ భావించాడు. ఈ క్రమంలోనే సయ్యద్‌కు ఫోన్ చేసిన ఖార్ సబ్‌వే వద్ద కలవాలని కోరాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పర్వేజ్‌ను సయ్యద్ మూడుసార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన పర్వేజ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. వకోలా పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబందించి షాజహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం తెల్లవారుజామున పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అనంతరం సయ్యద్‌ను బాంద్రాలో గుర్తించి అరెస్టు చేశారు.

click me!