టీనేజర్ పై అత్యాచారం.. యువకుడికి 20ఏళ్ల జైలు శిక్ష..!

Published : Aug 18, 2021, 11:20 AM ISTUpdated : Aug 18, 2021, 11:35 AM IST
టీనేజర్ పై అత్యాచారం.. యువకుడికి 20ఏళ్ల జైలు శిక్ష..!

సారాంశం

టీనేజ్ బాలికను.. ఓ యువకుడు కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. నిందితుడు(20) కి 20ఏళ్ల జైలు శిక్ష తోపాటు.. 20వేల జరిమానా కూడా విధించారు.  ఆ జరిమానా చెల్లించకుంటే.. మరో ఆరు నెలలు జైలు శిక్ష  అదనంగా అనుభవించాల్సిందనేనని కోర్టు పేర్కొనడం గమనార్హం.

టీనేజర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ యువకుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధ నగర్ కి చెందిన ఓ టీనేజ్ బాలికను.. ఓ యువకుడు కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. నిందితుడు(20) కి 20ఏళ్ల జైలు శిక్ష తోపాటు.. 20వేల జరిమానా కూడా విధించారు.  ఆ జరిమానా చెల్లించకుంటే.. మరో ఆరు నెలలు జైలు శిక్ష  అదనంగా అనుభవించాల్సిందనేనని కోర్టు పేర్కొనడం గమనార్హం.

నిందితుడిపై కొద్ది రోజుల క్రితం నోయిడా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 363( కిడ్నాప్), 366( బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకోవడం), 376( అత్యాచారం)  సెక్షన్ ల కింద కేసు నమోదు  చేశారు.  అంతేకాకుండా పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

నిందితుడు  చేసిన నేరం రుజువు కావడంతో.. నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. 

కాగా.. మహిళలు, బాలికలపై అత్యాచారానికి పాల్పడతున్న వారిని శిక్షించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. కాగా..  దీని కింద ఇప్పటి వరకు 67మందికి శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !