ఎంపీ రఘురామపై విమర్శలు..యూట్యూబర్ కి ఢిల్లీ పోలీసుల షాక్..!

Published : Aug 18, 2021, 08:37 AM IST
ఎంపీ రఘురామపై విమర్శలు..యూట్యూబర్  కి ఢిల్లీ పోలీసుల షాక్..!

సారాంశం

పంచ్ ప్రభాకర్‌ అమెరికాలో ఉంటూ వైసీపీని వ్యతిరేకించిన వారిపై యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. 

యూట్యూబర్ పంచ్ ప్రభాకర్ కు ఢిల్లీ పోలీసులు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు అనుమతి తీసుకొని పంచ్ ప్రభాకర్ పై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణమ రాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

యూట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్‌ అమెరికాలో ఉంటూ వైసీపీని వ్యతిరేకించిన వారిపై యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించారు. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఎంపీ రఘురామకృష్ణరాజు సహా.. పలువురు ప్రముఖులపై పంచ్ ప్రభాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తదుపరి విచారణ కొనసాగుతుందని ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టుకు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌