ఒక్క రోజులోనే ఇండియాలో 40 శాతం పెరిగిన కరోనా కేసులు: కానీ పెరిగిన రికవరీ

By narsimha lodeFirst Published Aug 18, 2021, 10:14 AM IST
Highlights


ఇండియాలో  అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు 40 శాతం పెరిగినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. గత 24 గంటల్లో 35,178 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 440 మంది మరణించారు. 

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో 35,178 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 40 శాతం అధికంగా కరోనా కేసులు నమోదైనట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.గత 24 గంటల్లో 440 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనాతో మరణించినవారి సంఖ్య దేశంలో  4,32, 519కి చేరుకొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,67,415కి చేరుకొంది. 

మరో వైపు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.14 శాతానికి చేరింది. ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఏడాది మార్చి తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కరోనా  యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.అంతేకాదు కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతానికి చేరింది.  23 రోజుల్లో 3 శాతానికి తక్కువగా నమోదైందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

కరోనా రోగుల రికవరీ రేటు 97.52 శాతంగా నమోదైంది. గత ఏడాది మార్చి తర్వాత రికవరీ రేటు ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే ప్రథమంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 3,14,85,923 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  గత 24 గంటల్లో కరోనా నుండి  37,159 మంది కోలుకొన్నారు. నిన్న ఒక్క రోజే 56.06 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. ఇప్పటివరకు దేశంలో 55,05,075 మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.


  

click me!