కేంద్రమంతి నివాసంలో మృతదేహం : పిస్టోల్ నా కొడుకుదే.. కానీ, ఆ సమయంలో అతను ఇంట్లో లేడు... కౌశల్ కిషోర్

Published : Sep 01, 2023, 12:21 PM IST
కేంద్రమంతి నివాసంలో మృతదేహం : పిస్టోల్ నా కొడుకుదే.. కానీ, ఆ సమయంలో అతను ఇంట్లో లేడు... కౌశల్ కిషోర్

సారాంశం

కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ ఇంట్లో ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. ఆ హత్య మంత్రి కుమారుడే చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా దీనిమీద కేంద్రమంత్రి స్పందించారు. 

లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ ఘటన కలకలం రేపింది. కేంద్ర మంత్రి మంత్రి కౌశల్ కిషోర్ నివాసంలో ఓ యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.  ఆ యువకుడిని కేంద్ర మంత్రి కొడుకే కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది.  శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు సమాచారం.  

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని  కేంద్ర మంత్రి నివాసంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రి నివాసంలో మృతి చెందిన యువకుడి పేరు వినయ్ శ్రీవాత్సవ అని పోలీసులు తెలిపారు. వినయ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన నేపథ్యంలో భారీ స్థాయిలో ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకున్నాయి.

యూపీలో అమానుషం... తల్లి పక్కనుండి చిన్నారి ఎత్తుకెళుతూ, నేలకేసి కొట్టిచంపిన దుండుగుడు

వినయ్ శ్రీవాత్సవ హత్యకేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ తుపాకీని ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు  వెలువరించింది.

అయితే, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శుక్రవారం కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసం వద్ద ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు. ఘటనా స్థలం నుంచి మంత్రి కుమారుడి పేరుతో లైసెన్స్‌డ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు వికాస్ శ్రీవాస్తవ, కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్ స్నేహితుడని పోలీసులు తెలిపారు.

ఘటన జరిగినప్పుడు తన కుమారుడు నివాసంలో లేరని మంత్రి కిషోర్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, "ఇది చట్ట ప్రకారం కొనసాగుతుంది" అని ఆయన తెలిపారు.

"పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను విడిచిపెట్టరు. సంఘటన జరిగినప్పుడు వికాస్ కిషోర్ నివాసంలో లేడు. సంఘటన జరిగినప్పుడు పోలీసులు అతని స్నేహితులను మరియు అక్కడ ఉన్న ప్రజలను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం.. ఈ విషయం తెలిసినప్పుడు వికాస్ చాలా బాధపడ్డాడు, చనిపోయిన వినయ్ నా కొడుకుకు చాలా మంచి స్నేహితుడు, ”అని మంత్రి చెప్పారు.

దీనిమీద కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ స్పందిస్తూ.. “పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్ తన కుమారుడిదేనని ఆయన ధృవీకరించారు.పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. దోషులను వదిలిపెట్టరు. ఘటన జరిగినప్పుడు వికాస్ కిషోర్ నివాసంలో లేడు. ఘటన జరిగినప్పుడు అతని స్నేహితులను, అక్కడున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు వికాస్ చాలా బాధపడ్డాడు, చనిపోయిన వినయ్ నా కొడుకుకు చాలా మంచి స్నేహితుడు”అని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం