రోడ్డు మీద గొడవ... వ్యక్తి వేలు కొరికి నమిలేసిన యువకుడు

Published : Oct 02, 2019, 12:51 PM IST
రోడ్డు మీద గొడవ... వ్యక్తి వేలు కొరికి నమిలేసిన యువకుడు

సారాంశం

సమయంలో ఇరు వాహనాలు నెమ్మదిగా వెళుతుండటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెద్దగా గాయాలు ఏమీ కాలేదు. అయితే... శ్యామ్ మోహర్, అస్ఘర్ లు ఒకరితో మరొకరు పోట్లాడుకున్నారు. ఈ క్రమంలో అస్ఘర్ కి బాగా కోపం వచ్చి.... శ్యామ్ మోహర్ చూపుడు వేలును కొరికేశాడు. అనంతరం దానిని నమిలేశాడు. వేలు తెగడంతో.. రక్తం బాగా కారింది.

రోడ్డు మీద జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి వేలు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... భోపాల్ కి చెందిన శ్యామ్ మోహర్ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై సోమవారం సాయంత్రం వెళ్తున్నాడు. ఆ సమయంలో అస్ఘర్ ఖాన్ అనే వ్యక్తి స్కూటీ పై వచ్చి.. వీళ్ల వాహనాన్ని ఢీకొట్టాడు.

ఆ సమయంలో ఇరు వాహనాలు నెమ్మదిగా వెళుతుండటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెద్దగా గాయాలు ఏమీ కాలేదు. అయితే... శ్యామ్ మోహర్, అస్ఘర్ లు ఒకరితో మరొకరు పోట్లాడుకున్నారు. ఈ క్రమంలో అస్ఘర్ కి బాగా కోపం వచ్చి.... శ్యామ్ మోహర్ చూపుడు వేలును కొరికేశాడు. అనంతరం దానిని నమిలేశాడు. వేలు తెగడంతో.. రక్తం బాగా కారింది.

తనకొడుకును అస్ఘర్ బూతులు తిట్టాడని అందుకే తాను గొడవ పడ్డానని.. ఆ మాత్రానికి వేలు కొరికేశాడని శ్యామ్ మోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్