కోర్టు ఆదేశాలను అమలు చేయండి: లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ సీఎం లేఖ

First Published Jul 5, 2018, 5:16 PM IST
Highlights

కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్  లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు లేఖ రాశారు. సర్వీస్ ఫైళ్లను తక్షణమే రిలీజ్ చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. సుమారు 5పేజీల లేఖను కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు రాశారు.


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా ఢిల్లీ కోర్టు బుధవారం నాడు  తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్  గురువారం నాడు లేఖ రాశారు.

ఐదు పేజీల లేఖను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు రాశారు.  అయితే ఈ లేఖ ప్రతిని సీఎం మీడియాకు విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సర్వీసు ఫైళ్లను తక్షణమే రిలీజ్ చేయాలని కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని సీఎం ఆ లేఖలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రశ్నించారు. 

ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదని  ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది.  నిర్ణయాలను  లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెబితే సరిపోతోందని  సూచించింది.  

ఢిల్లీ కోర్టు  బుధవారం నాడు  ఇచ్చిన తీర్పు  రాజకీయంగా ఆప్‌కు కలిసి వచ్చింది. మరో వైపు ఈ కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్  ఇబ్బంది పెట్టడంపై   ఆప్ తీవ్రంగా మండిపడుతోంది.  రాజకీయంగా  ఇబ్బంది పెట్టకుండా  కోర్టు ఆదేశాలను  అమలు చేయాలని  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కోరారు. 
 

click me!