ఢిల్లీ డెత్ మిస్టరీ: ఒకరి సమక్షంలో 11మంది సూసైడ్‌, ఎవరతను?

First Published Jul 5, 2018, 3:33 PM IST
Highlights

న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో 11 మంది ఆత్మహత్య చేసుకొన్న సమయంలో మరో వ్యక్తి అక్కడే ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ 12వ వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రధాన గేటు తెరిచి ఉండడాన్ని ఈ సందర్భంగా పోలీసులు ప్రస్తావిస్తున్నారు.


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఓకే కుటుంబంలో 11 మంది అనుమానాస్పద మృతి కేసులో  బయటి నుండి వచ్చిన వ్యక్తి  ప్రధాన పాత్ర పోషించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇంకా ఈ విషయమై ఇంకా నిర్ధారణకు రాలేదు. ఈ కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే మోక్షం కోసం భగవంతుడ్ని ప్రార్ధిస్తూ 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ కేసును పరిశోధిస్తున్న పోలీసులు  కూడ ఇంకా పూర్తిస్థాయి నిర్ధారణకు రాలేదు.

భాటియా కుటుంబం ఆత్మహత్యకు ముందు తాము నివాసం ఉన్న ఇంట్లో ‘వటవృక్ష’ పూజ నిర్వహించారు. సాధారణంగా పూజారుల సమక్షంలోనే దీనిని నిర్వహిస్తుంటారు. దీంతో బయటి నుంచి వచ్చిన వ్యక్తే ఈ పూజను నిర్వహించి ఉంటాడని భావిస్తున్నారు. మోక్షం కోసం భగవంతుడ్ని చేరేందుకు దగ్గరి దారి ఇదేనని ప్రలోభానికి గురి చేసి ఉండే అవకాశాలను కూడ తోసిపుచ్చలేమని  పోలీసులు అనుమానిస్తున్నారు.

భాటియా నివాసం ఉన్న ఇల్లు ప్రధాన గేటు తెరిచే ఉంది. అయితే ఆత్మహత్య చేసుకొనే సమయంలో  అతీతశక్తులు వచ్చి తమను కాపాడుతాయనే ఉద్దేశ్యంతోనే ప్రధాన గేటును తెరిచి ఉంచారా లేదా వీరంతా ఆత్మహత్యలు చేసుకొనే సమయంలో మరో వ్యక్తి ఇంట్లో ఉండి ఉంటాడా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

భాటియా కుటుంబసభ్యులు తరచూ తమ ఇంట్లో పూజలు నిర్వహించేవారు. పూజల నిర్వహణ కోసం స్వామీజీలు ఆయన ఇంటికి వచ్చేవారని స్థానికులు గుర్తు చేసుకొంటున్నారు. అయితే ఈ 11 మంది డెత్ మిస్టరీ కేసులో అసలు వాస్తవాన్ని తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

లలిత్ భాటియా తండ్రి 2007లో మరణించాడు.  అప్పటి నుండి ఆయన మానసికంగా కృంగిపోయాడు.  తండ్రి తనకు కలలో కన్పించి పలు ఆదేశాలు ఇచ్చేవాడని ఆయన డైరీలో రాసుకొనేవాడు.  

ఆయన ఆత్మ తనను నడిపిస్తోందని ఆయన కుటుంబసభ్యులను నమ్మించినట్టగుా  ఇంట్లో దొరికిన ఆధారాల ప్రకారంగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసులో వాస్తవాలను  తెలుసుకొనేందుకుగాను అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు  పోలీసులు చెబుతున్నారు. 

click me!