ప్రాణం తీసిన సరదా.. ఫ్రెండ్ బర్త్ డేకి వెడుతూ.. యువతుల కార్ల రేస్.. చివరికి..

Published : Dec 27, 2021, 08:22 AM ISTUpdated : Dec 27, 2021, 08:23 AM IST
ప్రాణం తీసిన సరదా.. ఫ్రెండ్ బర్త్ డేకి వెడుతూ.. యువతుల కార్ల రేస్.. చివరికి..

సారాంశం

యువతులు రెండు కార్లలో పోటాపోటీగా ప్రయాణిస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురైంది. మండ్య జిల్లా నాగమంగళం తాలూకాలోని గేటు వద్ద ఆదివారం ఉదయం కారు ప్రమాదంలో ఒక యువతి మరణించింది.  మృతురాలు బెంగళూరు  బాగలకుంటెకు చెందిన హెచ్‌టి. మంజుళాదేవి, పద్మరాజు దంపతుల కుమార్తె తనుశ్రీ (21)గా గుర్తించారు.   

కర్ణాటక : స్నేహితురాలి Birthday.. ఆ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. అప్పటివరకు నవ్వుతూ, తుళ్లూతూ, ఛాలెంజింగ్ గా గడిపిన ఆ యువతి క్షణాల్లో విగతజీవిగా మారింది. ఫ్రెండ్ బర్త్ డేకు సొంత కారులో వెడుతూ.. మిగతా స్నేహితులతో car race పెట్టుకోవడమే.. ఆమె పాలిట Death knellగా మారింది. 

కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. యువతులు రెండు కార్లలో పోటాపోటీగా ప్రయాణిస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురైంది. మండ్య జిల్లా నాగమంగళం తాలూకాలోని గేటు వద్ద ఆదివారం ఉదయం కారు ప్రమాదంలో ఒక యువతి మరణించింది.  మృతురాలు బెంగళూరు  బాగలకుంటెకు చెందిన హెచ్‌టి. మంజుళాదేవి, పద్మరాజు దంపతుల కుమార్తె తనుశ్రీ (21)గా గుర్తించారు. 

ఈమె మైసూరులో బీబీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటోంది. స్నేహితురాలి పుట్టినరోజు ఉండడంతో ఆదివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో సొంత కారు డ్రైవింగ్ చేసుకుంటూ మైసూర్ కు బయలుదేరింది. మధ్యలో ఇద్దరు స్నేహితురాళ్లు వారి, వారి కార్లలో వచ్చారు. వీరు ఇద్దరు పోటీలు పడుతూ, కార్లను వేగంగా నడుపుతూ వెళ్లారు. ఈ సమయంలో తనుశ్రీ కారు అదుపుతప్పి కోణనూరు దగ్గర వంతెన గోడను ఢీ కొట్టి సుమారు 50 అడుగుల దూరం పల్టీలు కొట్టింది.  తనుశ్రీ తీవ్రగాయాలతో అక్కడే కన్నుమూసింది. నాగ మంగళ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో విస్తుపోయే ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌కిలీ అధికారులు వేధింపులు త‌ట్టుకోలేక ఓ యువన‌టి బ‌ల‌వంతంగా ప్రాణాలు తీసుకుంది. Narcotics Control Bureau (NCB) అధికారుల‌మంటూ కొన్ని రోజులుగా ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ యువ‌ న‌టిని బెదిరింపుల‌కు గురిచేస్తున్నారు. 

దారుణం : అడవిలోకి లాక్కెళ్లి.. బాలికపై 9 మంది గ్యాంగ్‌రేప్, ఆపై వీడియో తీసి

40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేయ‌డంతో  తీవ్ర భయాందోళ‌న‌కు గురైన స‌ద‌రు న‌టి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ముంబ‌యిలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఆ న‌టి ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన ఆ ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వివ‌రాల్లోకెళ్తే..  ముంబయికి చెందిన 28 సంవ‌త్స‌రాల ఓ యువ నటి  డిసెంబరు 20న ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ ఫైవ్​స్టార్​ హోటల్​లో పార్టీకి వెళ్లింది. అయితే, హుక్కా పార్ల‌ర్‌లో ఉన్న‌ప్పుడు అక్కడకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు తాము Narcotics Control Bureau (NCB)  అధికారులమంటూ.. వాళ్ల‌ను బెదిరించారు.

అలాగే, డ్రగ్స్​ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే 40 లక్షలు రూపాయ‌లు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. ఆ రోజు నుంచి నిత్యం ఆ యువ‌న‌టిని  ఈ న‌కిలీ అధికారులు డబ్బుల కోసం  పదేపదే ఫోన్​ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్ర భ‌యాందోళ‌న‌, మ‌న‌స్థాపానికి గురైన స‌ద‌రు న‌టి బ‌ల‌వంతంగా త‌న ప్రాణాలు తీసుకుంది. త‌ను నివాసం ఉంటున్న గ‌దిలోనే ఫ్యానుకు ఊరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకునీ, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం