కొద్ది రోజుల్లో కూతురి పెళ్లి, అంతలోనే బ్లేడ్ తో కోసుకుని, ఉరికి వేలాడుతూ వధువు.. అసలేం జరిగిందంటే...

Published : Nov 17, 2021, 09:38 AM ISTUpdated : Nov 17, 2021, 10:03 AM IST
కొద్ది రోజుల్లో కూతురి పెళ్లి, అంతలోనే బ్లేడ్ తో కోసుకుని, ఉరికి వేలాడుతూ వధువు.. అసలేం జరిగిందంటే...

సారాంశం

సాయంత్రం sukhdev ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. ఎంత సేపు తట్టినా తలుపులు తెరుచుకోకపోవడంతో సుఖ్ దేవ్ పక్కనే ఉన్న తన కొడుకులకు కబురు పంపించాడు. వారంతా వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ప్రీతి dead body తన గదిలో వేలాడుతూ కనిపించింది. ఆమె చేతికి Blade తో కోసుకున్నట్లు రక్తపు మరకలు కూడా ఉన్నాయి. 

ఛత్తీస్ ఘడ్ : ఇంట్లో తన కూతురి పెళ్లి హడావుడి ఉండగా…. పనిమీద ఆ తండ్రి బయటికి వెళ్లి వచ్చాడు. అంతలోనే తన కూతురు శవమే కనబడింది. ఈ ఘోరం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ నగరంలో జరిగింది. బిలాస్ పూర్  నగరంలో  ఇమ్లీ బాట ప్రదేశంలో సుఖ్ దేవ్ (58) తన భార్య కూతురు ప్రీతి (19)తో నివాసం ఉంటున్నాడు. 

సుఖ్ దేవ్ కు ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు. వారంతా అదే వీధిలో పొరుగునే నివాసం ఉంటున్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. ఇక preetiకి కూడా marriage కుదిరింది. కూతురి పెళ్లి ఏర్పాట్లు పనుల్లో సుఖ్ దేవ్ ఉనాడు.

 అలా గత సోమవారం తన ప్రీతి తల్లి తన కొడుకుల వద్దకు పొరుగు ఇంటికి వెళ్లగా.. ప్రీతి ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం sukhdev ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. ఎంత సేపు తట్టినా తలుపులు తెరుచుకోకపోవడంతో సుఖ్ దేవ్ పక్కనే ఉన్న తన కొడుకులకు కబురు పంపించాడు. వారంతా వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ప్రీతి dead body తన గదిలో వేలాడుతూ కనిపించింది. ఆమె చేతికి Blade తో కోసుకున్నట్లు రక్తపు మరకలు కూడా ఉన్నాయి. 

సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ప్రీతి ఉరివేసుకుని Suicide చేసుకుందా? లేక మరెవరో ఆమెను murder చేశారా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. preeti శవాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు. ఇంతలో స్థానికులు చెప్పిన కొన్ని విషయాలు పోలీసుల్ని ఆలోచనలో పడేశాయి.  ప్రీతి చనిపోయే కొంత సమయం ముందు ఆ వీధిలో ఒక సంఘటన జరిగింది. దాని గురించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు చెప్పారు. అది విని polceలకు అసలు విషయం అర్థమయ్యింది. 

Social Media: ‘సోషల్ మీడియా అరాచకమే.. దాన్ని నిషేధించాలి’

చనిపోయేముందు ప్రీతిని అదే వీధిలో ఉన్న ఛోటు అనే యువకుడు నడిరోడ్డు మీద పట్టుకుని కొట్టాడు. ఆమె జుట్టుని లాగి పట్టుకుని ఈడ్చాడు. అది ఇరుగుపొరుగు వారంతా గమనించారు. కానీ ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. మనకెందుకొచ్చిన గొడవ, వారిద్దరి మధ్య ఏం జరిగిందో, ఏ సమస్య ఉందో అనుకున్నారే కానీ.. అడ్డుకోలేదు. 

ఇక, ఆ సమయంలో ప్రీతి కుటుంబ సభ్యులెవరూ కూడా లేరు. ఆ ఘటన తరువాత ప్రీతి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. ఆ తరువాత ఈ దారుణం జరిగింది. అయితే  గతంలో ప్రీతిని Chotu వెంటబడి వేధించేవాడని పోలీసులకి తెలిసింది. ఆమెకు పెళ్లి సంబంధం కుదరడంతో ఆ రోజు రోడ్డు మీద కొట్టాడని చూసిన వారు పోలీసులకు తెలిపారు.  ప్రస్తుతం పోలీసులు ప్రీతి death case ని హత్య కోణంతో విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న ఛోటు కోసం గాలిస్తున్నారు. అలా... ప్రేమోన్మాదుల ఘాతుకానికి ఇలా ఎంతో మంది అమ్మాయిలు ప్రతీరోజూ బలవుతూనే ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu