మార్నింగ్ వాక్ కు వెళ్లి మాయం.. ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న యువకుడు అడవిలో శవంగా.. ఏమైందంటే..

By SumaBala BukkaFirst Published Dec 24, 2022, 9:24 AM IST
Highlights

మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఓ యువకుడు అడవిలో శవంగా తేలాడు. ఆర్మీ జవాన్ కోసం ప్రిపేర్ అవుతున్న అతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన ఓ యువకుడు మృతదేహంగా దొరికాడు. ఆర్మీ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న ఆ యువకుడు రోజూ మార్నింగ్ రన్నింగ్ చేస్తుంటాడు. ప్రతీరోజూ లాగే ఆ రోజు కూడా పొద్దున్నే రన్నింగ్ కు వెళ్లాడు. అయితే, ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. రోజూవచ్చే సమయానికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు అతడికి ఫోన్ చేశారు. కానీ అతని ఫోన్ కలవలేవు. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. స్నేహితుల దగ్గరికేమైనా వెళ్లాడేమో అని తెలిసిన వారందరికీ కాల్ చేశారు. కానీ సమాచారం లేదు. చివరికి అతని ప్రియురాలికి ఫోన్ చేశారు.

ఆమె చెప్పిన విషయం విని కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే ఆ యువకుడు విగతజీవిగా కనిపించాడు. ఉత్తరప్రదేశ్ లోని సంపూర్ణ నగర్ కు చెందిన అమన్ గౌతమ్ అనే యువకుడు రోజూలాగే బుధవారం తెల్లవారుఝామున ఫ్రెండ్స్ తో కలిసి వాకింగ్ కు వెళ్లాడు. అయితే, ఎంతకీ తిరిగి రాలేదు. అమన్ కోసం వెతుకులాటలో భాగంగా ఫ్యామిలీ అంతా దగ్గరి బంధువులను, ఫ్రెండ్స్ ను విచారించారు. 

పోర్న్ స్టార్ బ్లాక్ మెయిల్ చేస్తోంది.. వీడియో తీసుకుని ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం, పరిస్తితి విషమం..

ఈ క్రమంలోనే అమన్ పక్కూర్లో ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డ సంగతి తెలిసింది. దీంతో కుటుంబసభ్యలందరూ కలిసి ఆమె ఇంటికి వెళ్లి అమన్ గురించి అడిగారు. ముందు భయపడ్డ ఆమె ఆ తరువాత అమన్ మృతదేహం ఎక్కడుందో చెప్పింది. అది విని షాక్ అయిన వారు.. వెంటనే ఆమె చెప్పిన అడవిలోని స్థలానికి వెళ్లారు. అక్కడ అచేతనంగాపడి ఉన్న అమన్ ను కదిలించగా.. అప్పటికే అతను మృతి చెందాడు. 

కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు అడవిలోని ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అమన్ కు విషం ఇచ్చి యువతి కుటుంబసభ్యులు చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అమన్ ప్రేమించిన యువతిని, కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అమన్ మృతి విషయంలో విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసులో మరింత ముందుకు వెడతామని చెబుతున్నారు. 

click me!