యువ డాన్సర్ ఆత్మహత్య.. ఆ కోరిక తీర్చితేనే నా ఆత్మకు శాంతి.. ప్రధాని మోడీకి సూసైడ్ నోట్‌లో విన్నపం

By telugu teamFirst Published Oct 11, 2021, 5:53 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో ఓ యువ డాన్సర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. గొప్ప డాన్సర్ కావాలనుకున్న తన కలలకు తల్లిదండ్రులు సహకరించలేదని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై పాట రాయించి అరిజిత్ సింగ్‌తో పాడించి నేపాల్ డాన్సర్ సుశాంత్ కత్రితో డాన్స్ చేయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూసైడ్ లెటర్‌లో అభ్యర్థించాడు.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ 16ఏళ్ల బాలుడు గొప్ప డాన్సర్ కావాలని కలలు కన్నాడు. చిన్నప్పటి నుంచి అదే కలను తనతో పాటే పెంచుకున్నాడు. కానీ, పేదరికం కారణంగా తల్లిదండ్రులు వారించారు. బుద్దిగా చదువుకోవాలని చెప్పారు. తాను dancer కాడానికి తల్లిదండ్రులు సహకరించడం లేదని ఆ బాలుడు మనస్తాపం చెందాడు. క్షణికావేశానికి లోనై రైలు  కింద పడి suicide చేసుకున్నాడు. అంతేకాదు, సూసైడ్ letterలో తన చివరి కోరిక రాశాడు. అది తీర్చాలని prime minister narendra modiని కోరాడు. అలాగైతేనే తన ఆత్మకు శాంతిస్తుందని తెలిపాడు.

గ్వాలియర్‌కు చెందిన అజ్జు ఇంటర్ చదువుతున్నాడు. మంచి డాన్సర్. భవిష్యత్‌లోనూ గొప్ప డాన్సర్ కావాలనుకున్నాడు. తల్లిదండ్రులు కూడదన్నారు. చదువుకోవాలని హితవు చెప్పారు. కుటుంబ సభ్యుల తీరుపై స్నేహితుల దగ్గర కన్నీరుపెట్టుకున్నాడు. ఆదివారం నాడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విషయం తెలియగానే పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులకు విషయం చేరవేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడే వారికి ఓ సూసైడ్ నోట్ లభించింది.

Also Read: గతజన్మ గుర్తొచ్చింది.. ఆదివారాలు ఆఫీసుకు రాలేను.. ఇంజనీర్ లీవ్ అప్లికేషన్.. దిమ్మదిరిగే రిప్లై ఇదే

‘అమ్మా నాన్న.. నన్ను క్షమించండి. నేను మీకు మంచి కొడుకుగా ఉండలేకపోయాను. గొప్ప డాన్సర్ కావాలనుకున్నాను. కానీ, మీరు సహకరించలేదు. డబ్బున్నోళ్లే డాన్సర్‌లు అవుతారని భావించారు. అందులోనూ మీ తప్పు లేదు’ అని అజ్జు సూసైడ్ లెటర్‌లో రాశాడు. 

ప్రభుత్వానికి ఓ విన్నపం చేశాడు. తనపై ఒక పాట రాయించి ఫేమస్ సింగ్ అరిజిత్ సింగ్‌తో పాడించాలని కోరాడు. ప్రముఖ నేపాలీ డాన్సర్ సుశాంత్ కత్రితో డాన్స్ చేయించాలని, దానికి ఆయనే కొరియోగ్రఫీ చేయాలని అభ్యర్థించాడు. ఇదే తన చివరి కోరిక అని, దీన్ని తీర్చితేనే ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నాడు.

Also Read: కథ అడ్డం తిరిగింది.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లోకి దోపిడీకి వెళ్లి.. షాకింగ్ లేఖ రాసి వచ్చిన దొంగ

రైలు కింద పడి మరణించడంతో అజ్జు శరీరం ఖండాలుగా విడిపోయిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

click me!