టోక్యో ఒలింపిక్స్ : గెలుపోటములు సహజమే.. మీ ప్రదర్శన అందరికీ ఆదర్శం.. భవానీ దేవికి మోడీ అండ..

By AN TeluguFirst Published Jul 27, 2021, 12:00 PM IST
Highlights

‘మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు’ అని ప్రధాని మోదీ అన్నారు. 

భారత ఏకైక ఫెన్సర్ భవానీ దేవికి ప్రధాని నరేంద్రమోడీ అండగా నిలిచారు. ఒలింపిక్స్ లో ఆమె ప్రదర్శన అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. శక్తి మేరకు పోరాడావంటూ అభినందించారు. గెలుపోటములు క్రీడల్లో భాగమేనని వెన్ను తట్టారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. 

భవానీ దేవి అరంగేట్రం ఒలింపిక్స్ లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. తొలిరౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో ఓటమి పాలైంది. ఒలింపిక్స్ ఫెన్సింగ్ లో ఒక మ్యాచ్ గెలిచిన తొలి భారతీయురాలిగా గర్వపడతున్నానని ఆమె తెలిపింది. అలాగే రెండో రౌండ్లో ఓడిపోయినందుకు క్షమాపణలు తెలియజేసింది. ఆమె ట్వీటుకు మోదీ స్పందించారు.

‘మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు’ అని ప్రధాని మోదీ అన్నారు. 
 
click me!