ఇండియాలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు: 132 రోజుల తర్వాత 30వేల దిగువకు

By narsimha lodeFirst Published Jul 27, 2021, 10:20 AM IST
Highlights


ఇండియాలో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. 132 రోజుల తర్వాత కరోనా కేసులు 29,689 గా నమోదయ్యాయి.  గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి 

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో  భారీగా కరోనా కేసుల నమోదు తగ్గింది.  గత 24 గంటల్లో సుమారు 29,689  వేల కేసులు నమోదయ్యాయి. 132 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 17,20,110 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో  29,689 మందికి కరోనా సోకిందని తేలింది. దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య  3.14 కోట్లకు చేరుకొంది. కరోనాతో నిన్న ఒక్క రోజే 415 మంది మరణించారు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 4,21,382 మంది చనిపోయారు.

గత 24 గంటల్లో కరోనా నుండి 42,363 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 3.06 కోట్లకు చేరుకొంది.  కరోనా యాక్టివ్ కేసులు 4 లక్షల దిగువకు పడిపోయాయి.  ప్రస్తుతం 3,98, 100 మంది కరోనాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.27 శాతానికి తగ్గింది.  దేశంలో కరోనా వ్యాక్సిన్ ను 66,03, 112 మంది తీసుకొన్నారు. నిన్న ఒక్క రోజే 44 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
 

click me!