
కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలను బీజేపీ నేత, బీహార్ మంత్రి రామ్ సూరత్ రాయ్ ప్రశంసించి ఒక్క సారిగా వెలుగులోకి వచ్చారు. ప్రధానిని పొగిడిన తీరుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ లో రెవెన్యూ, భూసంస్కరణల శాఖ మంత్రిగా ఉన్న ఆయన కొంత మందిని ఉద్దేశించి మాట్లాడారు.
సంతానం కోసం ఖైదీకి పెరోల్.. హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే?
ఈ సందర్భంగా ఆయన ‘‘ మీరంతా ఈరోజు బతికే ఉన్నారంటే దానికి కారణం నరేంద్రమోడీనే’’ అని అన్నారు. ‘‘పాకిస్తాన్, ఇతర చోట్ల కోవిడ్ సృష్టించిన వినాశనాన్ని చూడండి. మోడీ వ్యాక్సిన్, ఆర్థిక వ్యవస్థను ఆయన నేర్పుగా నిర్వహించడం ద్వారా మనం రక్షించబడ్డాం ’’ అని ఆయన తెలిపారు. ఈ వీడియో గత వారం రాయ్‌కు చెందిన ముజఫర్‌పూర్ జిల్లాలో రికార్డు చేశారు.
అయితే మంత్రి వ్యాఖ్యలకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు..‘‘ థాంక్యూ మోడీజీ.. అయితే దీనికి కూడా మేము జీఎస్టీ కట్టాలా ? ’’ అని వ్యంగంగా కామెంట్స్ చేస్తూ మంత్రి వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తున్నారు.
పంజాబ్ లో ఆప్ కౌన్సిలర్ దారుణ హత్య.. జిమ్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగుడు..
ఈ మధ్య కాలంలో మంత్రి ఇలాంటి పలు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.అంతకు ముందు సాయుధ దళాలలో నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నీపథ్' పథకాన్ని వ్యతిరేకించే వ్యక్తులను రామ్ సూరత్ రాయ్ ‘ఉగ్రవాదులు’ అని అభివర్ణించారు. అలాగే ఆందోళన పట్ల సానుభూతితో వ్యవహరించిన నితీష్ కుమార్ పట్ల, జేడీ (యూ) పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 మందికి పైగా అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 'వీటో’పై విరుచుకుపడి హెడ్ లైన్లలో నిలిచారు.