సంతానం కోసం ఖైదీకి పెరోల్.. హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే?

Published : Aug 01, 2022, 02:26 PM IST
సంతానం కోసం ఖైదీకి పెరోల్.. హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే?

సారాంశం

సంతానం పొందడానికి ఓ ఖైదీకి 15 రోజుల పెరోల్ అవకాశం కల్పించిన రాజస్తాన్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్పందించింది. సంతానం కోసం 15 రోజుల పెరోల్ అవకాశం ఇవ్వడంతో ఇతర ఖైదీలు కూడా పెరోల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పుపై తమకు కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయని, కానీ, తాము ఇందులో జోక్యం చేసుకోబోమని వివరించింది.  

న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టు సంతానం గురించి ఓ ఖైదీకి ఇచ్చిన వెసులుబాటు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. తన భర్త చేసిన పాపానికి తాను ఎందుకు శిక్ష అనుభవించాలని ఖైదీ భార్య రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సంతానాన్ని పొందకుండా తాను ఎందుకు శిక్ష అనుభవించాలని న్యాయస్థానంలో ఆవేదన చెందింది. ఈ పిటిషన్‌ విచారిస్తూ.. రాజస్తాన్ హైకోర్టు పిటిషనర్‌కు ఊరట ఇచ్చింది. సంతానం కోసం ఓ ఖైదీకి 15 రోజుల పెరోల్ ఇచ్చింది. ఈ వెసులుబాటు సంచలనంగా మారింది. చాలా మంది ఖైదీలు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు రాజస్తాన్ ప్రభుత్వం పేర్కొంది.

రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఓ కొత్త సమస్యను తెచ్చి పెట్టిందని రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంతానం కోసం ఖైదీకి 15 రోజలు పెరోల్ ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ.. ఇదే కారణం మీద ఇతర ఖైదీలూ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. దీని పై సుప్రీంకోర్టు స్పందించింది.

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం రాజస్తాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉపయోగించుకుని ఇతర ఖైదీలు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే అదే హైకోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది.

రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై తమకు కొన్ని సంశయాలు ఉన్నాయని, కానీ, ఇందులో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది.

ఏప్రిల్ 18వ తేదీన రాజస్తాన్ హైకోర్టు అజ్మేర్ సెంట్రల్ జైలులో శిక్ష పొందుతున్న నంద్ లాల్‌కు ఉపశమనం కలుగజేసింది. నంద్ లాల్ భార్య హైకోర్టును ఆశ్రయించి.. తాను సంతానం పొందడానికి అనుమతించాలని కోరింది. తనకు సంతానం కలగడం కోసం తన భర్తకు పెరోల్ ఇవ్వాలని అభ్యర్థించింది. 

సంతానం పొందే తన హక్కును కోల్పోతున్నానని, తాను ఎలాంటి నేరం చేయకున్నా.. శిక్ష అనుభవించాల్సి వస్తున్నదని వాదించారు. దీనిపై రాజస్తాన్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

దాంపత్య హక్కులను ఈ ఖైదీకి నిరాకరించినట్టయితే.. ఆయన భార్య హక్కులకు తీవ్రంగా విఘాతం కలిగించినట్టే అవుతుందని హైకోర్టు పేర్కొంది. ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ సంతానం పొందే హక్కు ప్రస్తావనలు ఉన్నాయని చెబుతూ ఖైదీకి 15 రోజుల పెరోల్‌ ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం