UP Assembly Election 2022: "వాళ్ల‌ది పిల్లల జోడీ".. అఖిలేశ్ పై యోగి ఫైర్

Published : Feb 02, 2022, 08:10 PM IST
UP Assembly Election 2022:  "వాళ్ల‌ది పిల్లల జోడీ"..  అఖిలేశ్ పై  యోగి ఫైర్

సారాంశం

UP Assembly Election 2022: 2013 ముజఫర్ నగర్ అల్లర్లలో అఖిలేశ్ యాదవ్ అతని మిత్రపక్షమైన జయంత్ చౌదరి ల‌పై పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు సీఎం యోగి ఆదిత్య‌నాథ్.  

UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌రం  రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఈ ఎన్నిక‌ల్లో అధికార బీజేపీ (BJP),సమాజ్‌వాది పార్టీ (SP)ల మ‌ధ్య హోరాహోరీ పోరు  నిల‌కొన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా  సీఎం యోగి ఆదిత్యనాథ్,  అటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నేరుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం మ‌రింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే.. ఇరు పార్టీలు ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. దీంతో పొలిటిక‌ల్ ఫైర్ మ‌రింత పెరుగుతోంది. 

 తాజాగా ..స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ పై సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 2013 ముజఫర్‌నగర్ అల్లర్లలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని మిత్రుడు జయంత్ చౌదరి ప్రమేయం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ ఎలక్షన్ స్పీచ్ లో భాగంగా అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరిల‌పై ఆరోపణలు గుప్పించారు.

2014 జాతీయ ఎన్నికలు, 2017 UP ఎన్నికలను ప్రస్తావిస్తూ..  ‘ఈ ఇద్దరు పిల్లల జోడీ ఉంది కదా. 2014లో కలిశారు. 2017లో కూడా.. 2017లో వారి విలువ ఏంటో తెలిసేలా రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్పారు’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అఖిలేశ్ యాదవ్, చౌదరి 2017 రాష్ట్ర ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
  
"2013లో, ముజఫర్‌నగర్ అల్లర్లు జరిగినప్పుడు, ఇద్దరు జాట్‌లు - సచిన్, గౌరవ్ - అనే ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. ఈ ఇద్దరిలో ఒకరు లక్నోకు చెందినవారు. అప్పుడు అధికారంలో ఉన్నారు. వారే ఈ  హత్యకు బాధ్యులు.  కేసులు పెట్టిన వారిని కటకటాల వెనక్కి నెట్టారని.. ఢిల్లీకి చెందిన వ్యక్తి (రాహుల్‌గాంధీ) కూడా వాదిస్తున్నారని... వారిపై చర్యలు తప్పవని అన్నారు. అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

‘ఈ జోడీ తిరిగొచ్చింది. కాకపోతే ప్యాకేజి మాత్రమే కొత్తగా ఉంది’ అని యూపీ సీఎం విమర్శించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ,తేజస్వి యాదవ్‌లపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో  ఏడు దశల ఎన్నికలు జ‌రుగబోతున్నాయి.  మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu