PMMVY: ఇకపై "PM మాతృ వందన" కు భర్త మద్దతు అవసరం లేదు: స్మృతి ఇరానీ

Published : Feb 02, 2022, 07:18 PM IST
PMMVY: ఇకపై "PM మాతృ వందన"  కు భర్త మద్దతు అవసరం లేదు: స్మృతి ఇరానీ

సారాంశం

PMMVY: ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) అమ‌ల్లో ఆవ‌రోధంగా ఉన్న భ‌ర్త ఆధార్ కార్డు వివరాలు, స‌దరు మ‌హిళ భర్త యొక్క‌ వ్రాతపూర్వక అనుమతి ఇకనుంచి అవ‌స‌రం లేద‌నీ, ఈ నిబంధ‌న‌ను తొలిగిస్తున్న‌ట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.  

PMMVY:  కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులు, ఆడపిల్లలు, మహిళలు ఇలా వివిధ కేటగిరిలకు వారికి వివిధ రకాల పథకాలను అందిస్తోంది. అదే విధంగా గర్భిణీలకు కూడా ఒక పథకం అందుబాటులో ఉంది. అదే..ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY). ఈ ప‌ధ‌కం ద్వారా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. గర్భిణీ స్త్రీలు & పాలిచ్చే తల్లులకు (PW&LM) ప్రసూతి ప్రయోజనాలు కోసం..మూడు విడతలుగా  ₹5,000/- ల‌ను అందజేస్తుంది. 

అయితే.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలను పొందడంలో భర్త అనుమ‌తి త‌ప్ప‌ని స‌రిగా ఉండేది. భ‌ర్త ఆధార్ కార్డు వివరాలు, స‌దరు మ‌హిళ భర్త యొక్క‌ వ్రాతపూర్వక అనుమతి కూడా అవసరం. అయితే.. నిబంధ‌న అవరోధంగా ఉండేది. ఈ స‌మ‌స్య‌ను గుర్తించి కేంద్రం. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలను పొందేందుకు ఇక నుంచి భర్త ఆధార్ కార్డు, భర్త లిఖితపూర్వక ఆమోదం అవసరం లేదని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నిబంధ‌న నేటి నుంచే ఈ ప్రాజెక్ట్ యొక్క డేటాబేస్లో ఉంచబడుతుంద‌ని తెలిపారు.

నీతి ఆయోగ్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని, ఈ నిబంధనను మార్చమ‌ని తెలిపారు.కొత్త నిబంధనల ఫలితంగా.. ఒంటరి తల్లులు, భర్త విడిచిపెట్టిన తల్లులు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారనీ, సవరించిన మార్గదర్శకాలు మోడీ ప్రభుత్వ మిషన్ ఫోర్స్ కింద జారీ చేయబడ్డాయనీ, ఈ మార్గదర్శకాల ప్రకారం, ఆధార్ సమాచారం, వ్రాతపూర్వక సమ్మతి తప్పనిసరి కాదని తెలిపారు.

ప్రధాన్ మంత్రి మాతృ వందన పథకం ద్వారా 19 ఏళ్లు పైబడిన గర్భిణులు, పాలిచ్చే తల్లులు ల‌బ్ధి పొందుతారు. మొదటి బిడ్డ ప్రసూతి ప్రయోజనం విషయంలో రూ.5000 / - ల‌ను మూడు విడుద‌ల్లో అందచేస్తారు. తొలి విడత కింద రూ.1,000 వస్తాయి. రెండో విడత కింద రూ.2,000 డబ్బులు వస్తాయి. ప్రెగ్జెన్సీ వచ్చిన ఆరు నెలల తర్వాత రూ.2,000 పొందొచ్చు. ప్రభుత్వం ప్రతి విడతలో డ‌బ్బుల‌ను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేస్తుంది. ఈ ప‌థ‌కం.. ఒరిస్సా,  తెలంగాణ మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమ‌లులో ఉంది. ఈ ప‌థ‌కం ద్వారా వలస కార్మికులు కూడా ప్రయోజనాలను పొందవచ్చు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu