Yogi Adityanath : సీఎం యోగిని కదిలించిన ఓ తల్లి ప్రేమ.. ఆమె కోసం ఏం చేశారో తెలుసా?

Published : Sep 29, 2025, 05:21 PM IST
Yogi Adityanath

సారాంశం

Uttar Pradesh : తప్పుచేసినవారి శిక్షించడంలో ఎంత కఠువుగా ఉంటారో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అంతకంటే ముందుంటారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇలా ఓ తల్లి బాధను చూసి ఆయన చలించిపోయారు.  

Uttar Pradesh : శరన్నవరాత్రులు… అంటే ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించే పండుగ సమయం.  ఇలాంటి పండగవేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన జనతా దర్శన్ లో మనసుకు హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధురాలు భావోద్వేగంతో ముఖ్యమంత్రి ముందు తన బాధను వెళ్లగక్కింది... దుఃఖంతో ఆమె గొంతు వణికింది. ఇలా అనారోగ్యంతో ఉన్న తన కొడుకు కోసం సహాయం అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళలో ఉపశమనం, ఆశ కనిపించాయి.

'మానవ సేవే మాధవ సేవ'

'మానవ సేవే మాధవ సేవ' అనే తన సూత్రానికి కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెబుతుంటారు. ఇలా రాష్ట్రంలోని 25 కోట్ల మంది ప్రజలను తన కుటుంబంగా భావించే సీఎం యోగి ఆమె దీనస్థితికి తీవ్రంగా చలించిపోయారు. ఆలస్యం చేయకుండా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె కొడుకును జనతా దర్శన్ వేదిక నుంచే ప్రభుత్వ అంబులెన్స్‌లో నేరుగా కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించి, తక్షణ వైద్య సంరక్షణ అందేలా చూశారు. సహాయం కోసం ఎన్నో తలుపులు తట్టి నిస్సహాయంగా ఉన్న కాన్పూర్‌కు చెందిన ఈ పేద మహిళకు, నవరాత్రులు కొత్త ఆశల పండుగగా మారాయి.

 

మానవత్వంతో స్పందించిన సీఎం యోగి

జనతా దర్శన్‌లో ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన 50 మందికి పైగా ప్రజలను కలిశారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, వారి దరఖాస్తులను స్వీకరించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వారిలో కాన్పూర్‌లోని రాయ్‌పుర్వాకు చెందిన 63 ఏళ్ల మహిళ తన బాధను ఇలా తెలియజేశాారు. "అయ్యా… యువకుడైన నా కొడుక్కి క్యాన్సర్ ఉంది. మేము పేదవాళ్ళం, చికిత్స చేయించుకోలేం, మాకు ఆయుష్మాన్ కార్డు కూడా లేదు. దయచేసి నా కొడుకు ప్రాణాలను కాపాడండి" అని వేడుకుంది. ఆమె మాటలకు చలించిన సీఎం యోగి, వెంటనే ఆమె కొడుకును ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించి, అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం "హర్ సేవ, నారాయణ్ సేవ" అనే భావనతో పనిచేస్తుందని, ప్రతి పౌరుడి ముఖంలో ఆనందం తీసుకురావడానికి కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. వైద్య చికిత్స కోసం ప్రభుత్వాన్ని సంప్రదించే ఎవరికైనా—వ్యక్తిగతంగా, ప్రతినిధుల ద్వారా, లేదా ఇతర మార్గాల ద్వారా—సహాయం అందుతుందని ఆయన నొక్కి చెప్పారు."మా ప్రభుత్వం ప్రతి బాధితుడికి అండగా నిలుస్తుంది," అని ఆయన భరోసా ఇస్తూ "చికిత్స కోసం అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం అందించడం కొనసాగిస్తాం" అని అన్నారు.

ఆరోగ్య సంబంధిత విజ్ఞప్తులతో పాటు జనతా దర్శన్‌లో ప్రజలు మధుర, బృందావన్, లక్నోలలో అక్రమ నిర్మాణాల గురించి, నోయిడాకు చెందిన సైబర్ ఫ్రాడ్ కేసులో చర్యలు తీసుకోకపోవడం గురించి, పోలీసు, పరిపాలన, రెవెన్యూ, విద్యుత్, ఆర్థిక సహాయానికి సంబంధించిన విషయాలను కూడా లేవనెత్తారు.

ఈ కార్యక్రమానికి మానవతా కోణాన్ని జోడిస్తూ, తమ పిల్లలతో వచ్చిన చాలా మంది ఫిర్యాదుదారులు ముఖ్యమంత్రిలోని సున్నితమైన కోణాన్ని చూశారు. సీఎం యోగి చిన్న పిల్లలను ప్రేమగా నిమిరి, వారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, చాక్లెట్లు, టాఫీలు పంచిపెట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే