ప్రయాగరాజ్ మహా కుంభమేళా సమాచారం ఇక మీ అరచేతిలో ... స్పెషల్ యాప్ రెడీ

By Arun Kumar PFirst Published Oct 30, 2024, 5:33 PM IST
Highlights

మహా కుంభం 2025 సమాచారమంతా ఇక మీ చేతిలోనే..! యోగి సర్కార్ కుంభమేళా కోసం ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చింది. 

ప్రయాగరాజ్ : ప్రయాగరాజ్‌లో 12 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా జరగనుంది. 2025 ఆరంభంలో అంటే జనవరి, పిబ్రవరి నెలల్లో ఈ ఆద్యాత్మిక వేడుక జరగనుంది. ఇప్పటికే ఈ కుంభమేళా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దేశ విదేశాల నుండి ప్రజలు ప్రయాగరాజ్ యాత్రకు సిద్దమయ్యాయి. అయితే అంతకు ముందు ఈ కుంభమేళా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వివిధ సెర్చ్ ఇంజన్లలో మహా కుంభం 2025 తేదీలు, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి తెగ వెతికేస్తున్నారు.

అయితే ఈ కుంభమేళా గురించిన సమాచారం కోసం ఇప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మహా కుంభమేళా 2025 అధికారిక యాప్‌లో అన్ని వివరాలు అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లో కుంభమేళా గురించి పూర్తి సమాచారాన్ని మాత్రమే కాకుండా ఇందుకు సంబంధించిన పుస్తకాలు, బ్లాగులకు సంబంధించిన వివరాలు కూడా అందిస్తుంది. దీంతో ఈ కుంభమేళా సంప్రదాయాలు, దాని ప్రాముఖ్యత గురించి మరింత సమాచారం పొందవచ్చు. మేళా అథారిటీ ఈ యాప్‌ను లైవ్ చేసింది... ప్రజలు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఐఐఎం సహా వివిధ సంస్థల పరిశోధనా నివేదికలు

Latest Videos

ప్రయాగరాజ్ భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. దీనిని పురాతన గ్రంథాలలో 'ప్రయాగ' లేదా 'తీర్థరాజ్' అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని పవిత్రమైన తీర్థయాత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నగరంలో ప్రతి సంవత్సరం వార్షిక మాఘ మేళా, ప్రతి ఆరు సంవత్సరాలకు కుంభమేళా, ప్రతి 12 సంవత్సరాలకు మహా కుంభమేళాకు ప్రసిద్ధి చెందింది. ప్రయాగరాజ్‌లో జరిగే ఈ మహా కుంభమేళా భూమిపై మానవాళి యొక్క అతిపెద్ద సామూహిక కార్యక్రమంగా పిలువబడతాయి. యునెస్కో కుంభమేళాను సాంస్కృతిక వారసత్వ జాబితాగా గుర్తించింది.

ఈసారి మహా కుంభమేళా కోసం నగరంలో సన్నాహాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు కుంభమేళా గురించి మరింత తెలుసుకోవడానికి మహా కుంభమేళా 2025 యాప్‌ను కూడా లైవ్ చేశారు. ఈ యాప్‌లో మహా కుంభమేళాకి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు కుంభమేళాలు, మహా కుంభమేళా గురించి వ్రాసిన ప్రధాన పుస్తకాల సమాచారం కూడా ఉంది. అలాగే ఇందులో ముఖ్యమైన బ్లాగుల విభాగం కూడా ఉంది, దీనిలో ఐఐఎం సహా అనేక పెద్ద సంస్థలు మహా కుంభంపై చేసిన నివేదిక కూడా చేర్చబడింది. దీని ద్వారా మహా కుంభంపై పరిశోధన చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రయాగరాజ్ గురించి కూడా తెలుసుకోవచ్చు

మహా కుంభమేళా బ్లాగ్ విభాగంలో యూపీ టూరిజం యొక్క ఎక్స్‌ప్లోర్ ప్రయాగరాజ్‌కు కూడా స్థానం కల్పించారు, దీనిలో సంగమ నగరి యొక్క ఆధ్యాత్మికత, ఆధునికతను తెలియజేయడానికి ప్రయత్నించారు. ఇందులో ప్రయాగరాజ్ పరిచయంతో పాటు నగరంలోని ఆకర్షణీయ ప్రదేశాలతో పాటు ప్రముఖుల ప్రస్తావన కూడా ఉంది. అదనంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు యొక్క 'ప్రయాగరాజ్ మహా కుంభం 2019' కూడా ఇందులో ఉంచబడింది, ఇది కుంభమేళా యొక్క సమగ్ర వివరాలను అందిస్తుంది.

ఇక పెయింట్ మై సిటీ, స్వచ్ఛ కుంభమేళా, ప్రయాగరాజ్ స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఫ్యూచర్, ది మాగ్నిఫిసెన్స్ ఆఫ్ కుంభమేళా వంటి అధ్యయన నివేదికలు కూడా ఈ యాప్ లో ఉంచబడ్డాయి, ఇవి ప్రయాగరాజ్, మహా కుంభమేళాను అర్థం చేసుకోవడంలో ముఖ్యమైనవి. ఇంకా యాప్‌లో కుంభంపై వివిధ వ్యక్తులు చేసిన అధ్యయనం, వారి పుస్తకం గురించి కూడా సమాచారం అందించబడింది, ఇది పరిశోధకులకు చాలా ప్రత్యేకమైనది.

click me!