
Sitaram Yechury: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీని గద్దె దింపేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల విస్తృత కూటమి ఏర్పాటు అవసరముందని పేర్కొన్న ఆయన.. ఆయా రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ 'హిందూ రాష్ట్ర' భావజాలం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అని ఆయన అన్నారు. ఈ భావజాలంతో దేశంలోని లౌకిక, ప్రజాస్వామ్య సంప్రదాయాల స్థానంలో కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని తెలిపారు. తమిళనాడులోని మధురైలో బుధవారం జరిగిన సీపీఐ(ఎం) పార్టీ 23వ సదస్సులో ఏచూరి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
సీతారం ఏచూరి తన ప్రారంభోపన్యాసంలో.. పౌరసత్వ సవరణ చట్టం, వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యలో రైతు నిరసనలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ఆర్థిక విధానాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, బీజేపీ దానిని కొనసాగించిందన్నారు. 'హిందూ రాష్ట్ర' భావజాలం ఎన్నికల్లో లబ్ది పొందిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలన్నింటినీ వెన్నుపోటు పొడిచి ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ విద్వేష రాజకీయాలను, హిందుత్వ గుర్తింపును ఉపయోగిస్తోందని సీతారాం ఏచూరి ఆరోపించారు.
అలాగే, ఇటీవల విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం గురించి కూడా ఏచూరి ప్రస్తావించారు. 1990లలో మిలిటెంట్లు కశ్మీరీ పండిట్లను చంపిన ఘటనల గురించి మాత్రమే మాట్లాడుతున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. హిందుత్వ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రధాని మోడీ ప్రచారం చేశారని ఏచూరి ఆరోపించారు. అదే సమయంలో ముస్లింలు సహా ఇతర మతాలకు చెందిన 1,635 మంది హత్యకు గురైన విషయంపై సినిమా మాట్లాడలేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో భగవద్గీత ప్రచారానికి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మద్దతు ఇస్తున్నారనీ పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం ఇతర మతాల గ్రంథాలను ఎందుకు ప్రోత్సహించడం లేదని ఏచూరి ప్రశ్నించారు.
అలాగే, కొత్త విద్యా విధానం ద్వారా ప్రజల ఆలోచనలను అదుపు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సీపీఐ (ఎం) నేత ఏచూరి అన్నారు. అంతేకాకుండా పాఠశాలల్లో భగవద్గీతను తప్పనిసరిగా బోధించాలని కేంద్రం ఆలోచన చేసింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గీతా విలువలను బోధించడాన్ని సమర్థించారు. "సెక్యులర్ దేశంలో ఇతర మతాల విలువలను బోధించకూడదని, దీన్ని మాత్రమే బోధించాలని ఎందుకు పట్టుబట్టాలి?" అని ప్రశ్నించారు. భగద్గీత సమాజంలో కుల సోపానక్రమం మరియు కుల దురాగతాలను మాత్రమే సమర్థిస్తుంది. ఆచారంపై నిషేధం ఉన్నప్పటికీ శూద్రులు మాన్యువల్ స్కావెంజింగ్ చేయవలసి వచ్చింది. దళితులు అగ్రవర్ణాలకు సేవ చేయాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. స్త్రీలను పురుషులు లొంగదీసుకోవడాన్ని గీత కూడా సమర్థించిందని ఆయన తెలిపారు. కుల దౌర్జన్యాలు, దళిత మహిళలపై అత్యాచారాలు, అట్టడుగు కులాల వారిని కాల్చిచంపడాన్ని యువత సమర్థించడాన్ని ఆదర్శవంతమైన సమాజంగా భావించి యువత మదిలో నాటుకుపోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అటువంటి తిరోగమన, వెనుకబడిన మరియు దోపిడీ వ్యవస్థను సృష్టించే ప్రయత్నాన్ని అనుమతించకూడదని ఏచూరి పేర్కొన్నారు.