మా నిరసనను నీరుకార్చే ప్రయత్నం చేశారు: రెజ్లర్ల సంచలన ఆరోపణలు

By Rajesh KarampooriFirst Published Apr 30, 2023, 2:42 PM IST
Highlights

భారత టాప్ రెజ్లర్లు నిరసన బాట పట్టారు. తమ నిరసనను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అసలు విషయం లైంగిక వేధింపులేనని అంటున్నారు.  
 

అంతర్జాతీయ వేదికపై భారత పతకాన్ని ఎగరవేసిన భారత రెజ్లర్లు నేడు నిరసన బాట పట్టారు. తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నరని ఆరోపిస్తున్నారు. పలువురు కోచ్ లతో పాటు..  భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ (WFI president ) బ్రిజ్ భూష‌ణ్‌ (Brij Bhushan)పై ఆరోపణలు చేస్తున్నారు. వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని టాప్ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ (Delhi)లోని జంత‌ర్ మంత‌ర్‌ (Jantar Mantar) వద్ద గత వారం రోజులుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారులు, రైతు సంఘాల నేతలు మద్దతు తెలిపారు. 

ఈ తాజాగా అంశంపై మరోవార్త వెలుగులోకి వచ్చింది. తమ నిరసనను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జాతీయ ఆటగాళ్లుగా ఆడటం తమకు ఇష్టం లేదన్న ఆరోపణలను వారు ఖండించారు. ఈ ఆరోపణ నిరాధారమని, అసలు విషయం లైంగిక వేధింపులేనని వారు చెప్పారు. కొందరు తమ నిరసనను తప్పు దారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడటానికి తాము ఇక్కడ ఉన్నామని ,మహిళల కోసం పోరాడటానికి తాము ఇక్కడ ఉన్నామని అన్నారు.  తమకు మద్దతివ్వడానికి పలునేతలు వస్తున్నారని , ఇక్కడ రాజకీయాలు జరగడం లేదని, కానీ, తమ నిరసనలను నీరుకాల్చే ప్రయత్నం జరుగుతోందని బజరంగ్ పునియా విలేకరుల సమావేశంలో అన్నారు.

Latest Videos


వినేష్ ఫోగట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "మేము జాతీయంగా ఆడలేదని ఆరోపించారు. అతను మాట్లాడుతున్న జాతీయ (పోటీ) నిబంధనల మార్పు నిరాధారమని, అవి అబద్ధమని  మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా.. ఇది జాతీయుల గురించి కాదు, లైంగిక వేధింపులకు సంబంధించినది. క్రీడలు దీనికి భిన్నమైనవి. మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి." అని అన్నారు. .

Also Read: మగాళ్లు స్కర్టులు ధరించడమేంట్రా బాబూ.. నెటిజన్ల ఫైర్
 
అంతకుముందు వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ రెజ్లర్లు కొత్త డిమాండ్లతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘రోజూ కొత్త డిమాండ్లతో వస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఇప్పుడు నన్ను జైలుకు పంపాలని, అన్ని పదవులకు రాజీనామా చేయాలని చెబుతున్నారు. నా నియోజకవర్గ ప్రజల వల్లే నేను ఎంపీగా ఉన్నాను. వినేష్ ఫోగట్ వల్ల కాదు. ఒక్క కుటుంబం మాత్రమే ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఇతర ప్రాంతాల ప్రజలు ఫిర్యాదు చేయడం లేదు? ఇతర రాష్ట్రాల హిమాచల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు ఎందుకు ముందుకు రావడం లేదు? 90 శాతం హర్యానా ఆటగాళ్లు నాతో ఉన్నారు” అని డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.

click me!