మగాళ్లు స్కర్టులు ధరించడమేంట్రా బాబూ.. నెటిజన్ల ఫైర్

Published : Apr 30, 2023, 01:35 PM IST
మగాళ్లు స్కర్టులు ధరించడమేంట్రా బాబూ.. నెటిజన్ల ఫైర్

సారాంశం

తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది. అందులో ఎలాంటి స్పష్టమైన కంటెంట్‌ కూడా లేదు. మరి ఎందుకు వైరలవుతోందని అనుకుంటున్నారా..? ఈ క్లిప్‌లో ఇద్దరు యువకులు మెట్రో రైడ్ కోసం స్కర్టులు ధరించాలని మెట్రోలో దర్శనమిచ్చారు. ఇప్పుడి వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. 

యువతపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది. ఓవర్ నైట్ స్టార్స్ కావాలని తెగ తాపత్రం పడుతుంటారు. సోషల్‌ మీడియాలో ఏ వీడియో పడితే ఆ వీడియో అప్‌లోడ్ చేస్తూ వైరల్ అయ్యేందుకు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఈ మధ్య మెట్రోలో ప్రయాణిస్తూ డ్యాన్సులు, ఇతర వింత చేష్టలతో రీల్స్ తీయడం ట్రెండ్ గా మారింది. తాజాగా.. అలాంటి మెట్రో వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఎలాంటి స్పష్టమైన కంటెంట్‌ కూడా లేదు. మరి ఎందుకు వైరలవుతోందని అనుకుంటున్నారా..? ఈ క్లిప్‌లో ఇద్దరు యువకులు మెట్రో రైడ్ కోసం స్కర్టులు ధరించాలని మెట్రోలో దర్శనమిచ్చారు. ఇప్పుడి వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. 

ఈ వైరల్ అవుతున్న వీడియోను సమీర్ ఖాన్ అనే నెటిజన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సమీర్‌, భవ్యకుమార్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) యూజర్లు. పొడవాటి డెనిమ్ స్కర్ట్స్ ధరించి మెట్రో ఎక్కారు. వారు ఏ మాత్రం సిగ్గు పడకుండా.. వీడియోలకు, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇదేం ట్రెండ్ ర్రా బాబూ అంటూ  జనాలు నవ్వుకున్నారు. వీరిద్దరు తమ మెట్రో రైడ్ కోసం డెనిమ్ స్కర్ట్‌లను ధరించడాన్ని చూడవచ్చు. స్కర్ట్స్ తో మెట్రో ప్రయాణం అని వీడియోలోని టెక్స్ట్ రాయబడింది. 

ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. ఈ క్లిప్ కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి టన్నుల కొద్దీ కామెంట్స్ వస్తున్నాయి. "లుంగీ పర్వాలేదు కానీ స్కర్టులేంటీ బ్రో ? అవి కామెంట్స్ చేస్తున్నారు. మీ కాసెప్ట్ ఎంటో నాకు అర్థం కాలేదు" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.  మరొక నెటిజన్ ఇలా స్సందించారు. "ఇది చాలా సౌకర్యవంతం, స్టైలిష్ & సూపర్.ప్రతి ఒక్కరూ వాటిని ఎందుకు ధరించకూడదో? " అంటూ కామెంట్స్ చేశారు. మగవారు ఈ బట్టలు వేసుకోవడమేమిటో అని నెటిజన్లు నవ్వుల ఇమెజీలతో మరికొందరు స్పందించారు.  

 

 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..