రెజ్లర్లు విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు - కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు

By Asianet NewsFirst Published Jun 9, 2023, 2:29 PM IST
Highlights

రెజ్లర్లు తన నిరసన సమయంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కోర్టుకు శుక్రవారం ఏటీఆర్ దాఖలు చేశారు. 

రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై తప్పుడు ఆరోపణలు చేసి, విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ పోలీసులు శుక్రవారం కోర్టులో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) దాఖలు చేశారు.

ఔరంగజేబును పొగుడుతూ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టిన 14 ఏళ్ల బాలుడు.. మహారాష్ట్రలోని బీడ్ లో ఉద్రిక్తత

ఫిర్యాదుదారుడు అందించిన వీడియోలో రెజ్లర్లు నినాదాలు చేయడం లేదని స్పష్టం చేశారు. వారెవరూ విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదని చెప్పారు. కాబట్టి పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు.  ఈ పిటిషన్ పై తదుపరి వాదనలను కోర్టు జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. ఈ ఫిర్యాదుపై మే 25వ తేదీన కోర్టు పోలీసుల నుంచి ఏటీఆర్ కోరింది. దీంతో పోలీసులు కోర్టులో తమ వాదన వినిపించారు. 

రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లపై 'అటల్ జన్ పార్టీ' జాతీయ చీఫ్ గా చెప్పుకునే బామ్ బామ్ మహారాజ్ నౌహతియా అనే వ్యక్తి తరఫున దాఖలైన పిటిషన్ ను కోర్టు విచారించింది. వచ్చే నెల ఈ పిటిషన్ మరో సారి విచారణకు రానుంది.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపులు.. హోం మినిస్టర్ జోక్యం చేసుకోవాలి - సుప్రియా సూలే

డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పలువురు రెజ్లర్లు గత కొంత కాలం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవరం రోజు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి రెజ్లర్లను పోలీసులు ఖాళీ చేయించారు. తరువాత రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం పలువరు రెజ్లర్లు తమ ఉద్యోగాల్లో చేరారు. తాము ఉద్యమం విరమించలేదని, తమకు న్యాయం జరిగేంత వరకు దానిని కొనసాగిస్తామని తెలిపారు. 

సరస్వతి ఆత్మహత్య చేసుకుంది.. అరెస్టు నుంచి తప్పించుకోవాలనే శరీరాన్ని ఉడకబెట్టాను - పోలీసులతో మనోజ్ సానే

ఈ క్రమంలో రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం సమావేశమయ్యారు. అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. రెజ్లర్లతో సానుకూలంగా చర్చించామని, పదవీ విరమణ చేస్తున్న సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన చార్జిషీట్ ను జూన్ 15లోగా దాఖలు చేస్తామని తెలిపారు. ‘‘డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసి జూన్ 15లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని వారు (రెజ్లర్లు) డిమాండ్ చేశారు. జూన్ 30 నాటికి డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరుగుతాయి’’ అని చెప్పారు. సమావేశంలో అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని, వివిధ అకాడమీలు, క్రీడాకారులపై కేసులను ఉపసంహరించుకోవాలని, సింగ్, అతడి సహచరులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొననివ్వవద్దని రెజ్లర్లు డిమాండ్ చేశారని క్రీడా మంత్రి తెలిపారు.

click me!