ఔరంగజేబును పొగుడుతూ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టిన 14 ఏళ్ల బాలుడు.. మహారాష్ట్రలోని బీడ్ లో ఉద్రిక్తత

By Asianet NewsFirst Published Jun 9, 2023, 1:43 PM IST
Highlights

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఔరంగజేబును పొగుడుతూ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసిస్తూ మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలుడు సోషల్ మీడియా స్టేటస్ మెసేజ్ పెట్టాడు. దీంతో ఆ బాలుడి నివసించే బీడ్ జిల్లాలోని అస్తి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు నిరసనగా కొన్ని హిందుత్వ అనుకూల సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపులు.. హోం మినిస్టర్ జోక్యం చేసుకోవాలి - సుప్రియా సూలే

17వ శతాబ్దానికి చెందిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఫోటోలను కొందరు యువకులు అహ్మద్ నగర్ లో ఊరేగింపులో ప్రదర్శించడం, 18వ శతాబ్దానికి చెందిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ చిత్రాన్ని కొందరు స్థానికులు సోషల్ మీడియా స్టేటస్ గా ఉపయోగించడంపై కొల్హాపూర్ నగరంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దీనిపై బీడ్ ఎస్పీ నందకుమార్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘14 ఏళ్ల బాలుడు గురువారం సోషల్ మీడియా వేదికగా ఔరంగజేబ్ ను ప్రశంసిస్తూ స్టేటస్ మెసేజ్ పెట్టాడు. దీనికి సంబంధించి ఫిర్యాదు అందింది. దాని ఆధారంగా అష్టి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం. ఆ తర్వాత స్థానికంగా ఉన్న కొన్ని హిందుత్వ అనుకూల సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.’’ అని తెలిపారు.

సరస్వతి ఆత్మహత్య చేసుకుంది.. అరెస్టు నుంచి తప్పించుకోవాలనే శరీరాన్ని ఉడకబెట్టాను - పోలీసులతో మనోజ్ సానే

ప్రస్తుతం ఆ బాలుడు అస్తిలో లేడని, విహారయాత్ర కోసం ముంబైకు వెళ్లాడని చెప్పారు. విచారణ అనంతరం అతడిని జువైనల్ కోర్టులో హాజరుపరుస్తామని ఠాకూర్ తెలిపారు. బంద్ సందర్భంగా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. 

హిజాబ్ వివాదం.. పాఠశాలల్లో మత మార్పిడికి పాల్పడితే ఊరుకోబోము - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు టిప్పు సుల్తాన్ ఫోటోతో పాటు అభ్యంతరకరమైన ఆడియో సందేశాన్ని తమ సోషల్ మీడియా స్టేటస్ గా పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. మరుసటి రోజు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఉపయోగించడాన్ని నిరసిస్తూ జరిగిన ప్రదర్శనలో రాళ్లు రువ్విన వందలాది మంది నిరసనకారులను పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది. కొల్హాపూర్ హింసకు సంబంధించి 36 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

click me!