ఫుట్‌బాల‌్‌ను కాదు.. అల్లాను ఆరాధించండి: ముస్లిం సంస్థ పిలుపు.. సీపీఎం నేత ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Nov 25, 2022, 4:46 PM IST
Highlights

ఫుట్‌బాల్‌ను కాదు.. అల్లాను ఆరాధించాలని కేరళకు చెందిన ఓ ముస్లిం సంస్థకు ముస్లిం యువతు పిలుపు ఇచ్చింది. మతానికి మించి మరేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరాదని తెలిపింది. ఈ వ్యాఖ్యలకు కేరళ విద్యాశాఖ మంత్రి, సీపీఎం నేత కౌంటర్ ఇచ్చారు. అది వారి వ్యక్తిగత ఇష్టం అని వివరించారు.
 

తిరువనంతపురం: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ఇప్పుడు నడుస్తున్నది. మన దేశంలోనూ ఫుట్‌బాల్ అంటే ఆసక్తి, ఆదరణ, అభిమానం పెరుగుతున్నది. కేరళలో ఈ ఏడాది వరల్డ్ కప్ ఫుట్ బాల్ పై అభిమానాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. నేపథ్యంలో కేరళకు చెందిన సమస్త కేరళ జామ్ ఇయ్యతుల్ ఖుత్బా కమిటీ యువతను ఉద్దేశించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్‌కు సీపీఎం నేత, కేరళ విద్యా శాఖ మంత్రి వీ శివన్ కుట్టీ కౌంటర్ కూడా ఇచ్చారు.

ఫుట్‌బాల్ హీరోలను పూజించండం ఇస్లాం ఆమోదించదని తెలిపింది. ఈ కమిటీ డైరెక్షన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, కమిటీ జనరల్ సెక్రెటరీ నాజర్ ఫైజీ కూడతై అదే కోణంలో రియాక్ట్ అయ్యారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఫుట్‌బాల్ పై అమితమైన ప్రేమను పెంచుకోవడం, ఫుట్‌బాల్ దిగ్గజాలపై ఆరాదించాలని ఓ హెచ్చరిక చేస్తామని ఆయన తెలిపారు. 

ఫుట్‌బాల్ పై పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే... ఆ ప్లేయర్లను ఆరాధిస్తూ మన దేశ జెండా కంటే కూడా విదేశీయుల జెండానే ఇష్టపడే వరకు చేరిందని ఆయన అన్నారు. చాలా మంది ప్రజలు బతకడానికే ఆపసోపాలు పడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో మన యువత మాత్రం ఫుట్‌బాల్ ప్లేయర్ల కటౌట్‌లు కట్టడానికి డబ్బులు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలు చదువులు పక్కనపెట్టి మ్యాచ్ ల కోసం టీవీ తెరలకు అతుక్కుపోతున్నారని తెలిపారు. వారు ప్రార్థనల కోసం మసీదులకు కూడా రావడం లేదని వివరించారు. 

Also Read: FIFA: ఇరాన్ ఫుట్‌బాలర్‌కు షాకిచ్చిన ప్రభుత్వం.. దేశాన్ని కించపరుస్తున్నారంటూ అరెస్ట్

సినిమా, క్రీడా, రాజకీయ నేతలనూ ఆరాధించడంపై నియంత్రణ పాటించాలని అన్నారు. భారత్‌ను ఆక్రమించిన దేశాల్లో ఒకటైన పోర్చుగల్‌ వంటి దేశాలనూ వారు ఇష్టపడుతున్నారని, ఇస్లాంపై దుష్ప్రచారం చేసే దేశాలనూ ఇష్టపడుతున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు.

ఖురాన్ క్రీడలను ప్రోత్సహిస్తుందని, కానీ, అది కేవలం భౌతిక, మానసిక ఆరోగ్యం కోసం మాత్రమే అని వివరించారు. కానీ, దానికే బానిసైపయి రేయింబవళ్లు మ్యాచ్‌లు చూసుకుంటూ ఉండాలని కాదని తెలిపారు. ఫుట్‌బాల్ ఒక వ్యసనం కావొద్దని అన్నారు. మత విశ్వాసకుడు మరే విషయాలపై అంతటి ప్రేమ, ప్రాధాన్యతలు చూపకూడదని తెలిపారు. కాలం, డబ్బు అన్నీ ఆ దేవుడే ఇచ్చాడని, వాటన్నింటిపై ఆ దేవుడికి లెక్క చెప్పాల్సిందేనని అన్నారు.

కాగా, సీపీఎం నేత, విద్యా శాఖ మంత్రి వీ శివన్ కుట్టి దీనిపై స్పందించారు. ప్రజలు వారి స్టార్స్‌ను ఆరాధించే హక్కు కలిగి ఉంారని, ఫుట్‌బాల్‌ను ప్రేమించాలా? లేదా? అనేది వారి వ్యక్తగత నిర్ణయం అని వివరించారు. అలాంటి ఆదేశాలు చేసే హక్కూ ఆ సమస్తకు ఉన్నదని, అయితే, ఆ ఆదేశాలను పాటించాలా? లేదా? అనే నిర్ణయం ఆ వ్యక్తులకే వదిలిపెట్టాలని తెలిపారు.

click me!