పదో తరగతి బాలుడిపై క్లాస్ మేట్స్ లైంగిక దాడి.. హాస్పిటల్ లో చేరిన బాధితుడు..

Published : Nov 25, 2022, 04:42 PM IST
పదో తరగతి బాలుడిపై క్లాస్ మేట్స్ లైంగిక దాడి.. హాస్పిటల్ లో చేరిన బాధితుడు..

సారాంశం

పదో తరగతి బాలుడిపై క్లాస్ మేట్స్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలుడి అవయవాలపై గాయాలు అయ్యాయి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితుడు హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

చెన్నైలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని తోటి విద్యార్థులు వేధింపులకు గురిచేశారు. శారీరకంగా, లైంగికంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆ పిల్లాడు అంతర్గత గాయాలతో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాధితుడు కొన్ని నెలల కిందటే తన తల్లిదండ్రులతో కలిసి చెన్నైకి వచ్చాడు.

అన్నంలో చీమలు వచ్చాయని దంపతుల మధ్య గొడవ.. భర్తను స్కార్ఫ్‌తో ఉరేసి చంపిన భార్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలుడు నాలుగు నెలల కిందట పాఠశాలలో చేరాడు. పదో తరగతి చదువుతున్న ఆ బాలుడిని తోటి విద్యార్ధులు శారీరకంగా వేధించారు. దీంతో ఆ అబ్బాయి మరుసటి రోజు పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించాడు. తల్లిదండ్రులు ఏం జరిగిందని బాలుడిని ఆరా తీశారు. దీంతో జరిగిన విషయం వారికి చెప్పారు. వారు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.

15 ఏళ్ల నాటి ప్రభుత్వ వాహనాలు రద్దు చేస్తాం - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

దీంతో ఉపాధ్యాయులు ఆ విద్యార్థులను హెచ్చరించాడు. తరువాత రోజు నుంచి విద్యార్థి పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. అయితే సోమవారం పది మందికి పైగా బాలులు ముఠాగా ఏర్పడి శారీరకంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు. ఈ ఘటనలో బాలుడి అవయవాలు, పొత్తికడుపుపై అంతర్గత గాయాలు అయ్యాయి.

'భారతదేశ చరిత్ర అంటే కేవలం బాబర్, జహంగీర్ కథలు కాదు...'

బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించి, అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. కానీ కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్ (సీఎస్ఆర్) లో ఫిర్యాదును నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu