ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఫారీన్ పార్టీ.. బీజేపీ: ప్రముఖ అమెరికా పత్రికా వాల్‌స్ట్రీట్ జర్నల్

By Mahesh KFirst Published Mar 21, 2023, 1:15 PM IST
Highlights

బీజేపీ.. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసం పేర్కొంది. ఇది అతి ముఖ్యమైన రాజకీయపార్టీనే కాదు.. అతి తక్కువగా అర్థమైన పార్టీ కూడా అని తెలిపింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వాటి భావజాలం, భారత దేశ పరిస్థితులు, ఇండో పసిఫిక్ రీజియన్‌లో అమెరికా సంబంధాల గురించి రచయిత ఇందులో చర్చించారు.
 

న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికా మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ బీజేపీ పై  ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఫారీన్ పొలిటికల్ పార్టీ బీజేపీ అని స్పష్టం చేసింది. అంతేకాదు, అతి తక్కువగా అర్థం చేసుకున్న పార్టీ కూడా బీజేపీనే అని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ ఒపీనియన్ పీస్ పేర్కొంది.

2014, 2019లో విజయం సాధించిన బీజేపీ 2024లో మరోసారి విజయపతాకాన్ని ఎగరేయడానికి వెళ్లుతున్నదని ఆ పత్రిక తెలిపింది. భారత దేశం ఇప్పుడు కేవలం ఒక ఆర్థిక శక్తిగానే కాదు.. ఇండో పసిఫిక్ రీజియన్‌లో జపాన్ తరహాలోనే ఒక కీలకమైన అమెరికా భాగస్వామిగా ఎదిగిందని వివరించింది. అమెరికా సహాయం లేకుండానే జపాన్‌లో బీజేపీ తన అవసరాలను తీర్చుకునే స్థితికి ఎదుగుతున్నదని తెలిపింది. ఈ వ్యాసాన్ని ఫారీన్ జర్నలిస్టు వాల్టర్ రస్సెల్ మీడ్ రాశారు.

ఒకప్పుడు చాలా తక్కువ మందికే పరిమితమైన, ప్రధాన స్రవంతిలో లేని ఒక సామాజిక ఉద్యమం ఇప్పుడు అక్కడ ప్రాబల్యాన్ని కలిగి ఉన్నదని ఆ వ్యాసం పేర్కొంది. ముస్లిం బ్రదర్‌హుడ్ తరహాలోనే బీజేపీ కూడా పాశ్చాత్యలు ఉదారవాద ప్రాధాన్యతలను, ఐడియాలను తిరస్కరిస్తుందని, అదే సమయంలో కీలకమైన ఆధునికీకరణను ఆదరిస్తుందని వివరించింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ తరహాలోనే బీజేపీ కూడా వంద కోట్లకు మించిన జనాభాతో గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదగాలని భావిస్తున్నదని తెలిపింది. ఇజ్రాయెల్‌లోని లికుడ్ పార్టీ తరహా బీజేపీ మార్కెట్ అనుకూల ఆర్థిక వైఖరిని జనాకర్షక వ్యాఖ్యలతో అవలంభిస్తుందని పేర్కొంది. అదే విధంగా సాంప్రదాయ విలువలనూ బీజేపీ ఉపయోగించుకుంటుందని తెలిపింది. అంతేకాదు, కాస్మోపాలిటాన్, పాశ్చాత్య ప్రభావిత సంస్కృతి, రాజకీయ కులీనుల నుంచి పరాయికరణగావించిన వారినీ బీజేపీ తన బలంగా మలుచుకుంటుందని వివరించింది.

అధికార పక్షాన్ని విమర్శించే విలేకరులు నిత్యం వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మతపరమైన మైనార్టీలు భయపడే హిందు ప్రైడ్.. దానితోనే ఏర్పడిన బీజేపీ ఇండియా మూక హింస గురించి మాట్లాడుతుందని లెఫ్ట్ లిబరల్ దృక్పథం గలవారు చెబుతుంటారని ఆ వ్యాసం పేర్కొంది. అంతేకాదు, ఇండియా సంక్లిష్టమైన ప్రాంతమని, అదే మతపరమైన మైనార్టీలు ఎక్కువగా ఉండే క్రిస్టియన్ ప్రాబల్యం ఈశాన్య భారత్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపింది. 20 కోట్ల జనాభా గల యూపీలో బీజేపీకి మంచి మద్దతు ఉందని, అక్కడ షియా ముస్లింలు కూడా బీజేపీని ఆదరిస్తారని వివరించింది.

సీనియర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలతో తాను భేటీ అయిన తర్వాత తనకు అర్థమైంది ఏమిటంటే.. అమెరికన్లు, పాశ్చాత్యులు మరింత సంక్లిష్ట, శక్తివంతమైన నిర్ణయాలతో భారత్‌తో లోతైన అవగాహనను కలిగి ఉండాలని మీడ్ రాసుకొచ్చారు.

Also Read: అదానీ వ్య‌వ‌హారంపై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందే.. పార్లమెంట్ ఉభయ స‌భలు వాయిదా

ఒకప్పుడు ప్రధాన స్రవంతిలో లేని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పౌర సామాజిక సంస్థ అని వివరించారు. గ్రామీణంలో, పట్టణాల్లో డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, రిలీజియస్ ఎడ్యుకేషన్, రివైవల్ ఎఫర్టులతో వేలాది మంది వాలంటీర్లను సంపాదించుకుందని, వీరి ద్వారా రాజకీయ స్పృహను పెంపొందించిందని పేర్కొన్నారు. 

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌లతో వ్యాసకర్త సమావేశం అయ్యాడని వివరించారు. మోస్ట్ ర్యాడికల్ వాయిస్‌గా పేర్కొన్న ఒక హిందూ మాంక్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తనతో భేటీలో పెట్టబడులు, అభివృద్ధి గురించి మాట్లాడారని, ఆర్ఎస్ఎస్ చీఫ్, స్పిరిచుల్ లీడర్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం గురించి మాట్లాడారని, మతపరమైన వివక్ష, పౌర హక్కుల ఉల్లంఘనలను ఆయన అంగీకరించనేలేదని రాశారు.

టాప్ లీడర్లు ఫారీన్ జర్నలిస్టులతో ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నప్పుడు అక్కడ క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలను అంచనా వేయడం అసాధ్యం అని వ్యాసకర్త పేర్కొన్నారు. కానీ, ఒకప్పుడు ఫ్రింజ్‌గా ఉన్నవారు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నారు.. కాబట్టి, వారు తమ మూలాలను పదిలపరుచుకునే విదేశాలతో సత్సంబంధాలు నెరపాలని భావిస్తున్నట్టు తనకు అర్థమైందని అభిప్రాయపడ్డారు. కాబట్టి, పెట్టబడిదారులు, దౌత్యవేత్తలు, విధానకర్తలు అంతా హిందూ జాతీయవాద ఉద్యమ గుణాలు, భావజాలాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. మరింత లోతైన అవగాహనతో ఇండియతో ఎంగేజ్ కావాలని తెలిపారు.

click me!