india vs australia world cup 2023 : బుధవారం న్యూజిలాండ్ ను ఓడించి భారత్ ఇప్పటికే వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
india vs australia world cup 2023 : మరో రెండు రోజుల్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా టీమ్ లకు మధ్య ఈ జరిగే ఈ మ్యాచ్ కోసం దేశం ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తోంది. అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు ముందు ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ ఎయిర్ షో నిర్వహించాలని నిర్ణయించాయి.
Kulgam encounter: కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం..
undefined
ఈ నెల 19న జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ బృందం ఎయిర్ షో నిర్వహించనుందని ఓ అధికారి గురువారం తెలిపారు. మొతేరా ప్రాంతంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి పది నిమిషాల ముందు సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం ప్రజలను అలరిస్తుందని గుజరాత్ డిఫెన్స్ పీఆర్వో ప్రకటించారు.
కాగా.. ఈ ఎయిర్ షో కోసం నేడు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా రిహార్సల్స్ నిర్వహించాయి. ఈ రిహార్సల్స్ చూపరులను అబ్బురపర్చాయి. నగరంలోని బిల్డింగ్స్ మీదుగా ఈ విమానాలు అద్భుత ప్రదర్శన ఇచ్చాయి. వీటిని స్థానికులు తమ సెల్ ఫోన్ లలో బంధించారు. వాటిని సోషల్ మీడియాల్లో అప్ లోడ్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య.. ఎయిరిండియా ఉద్యోగి అరెస్టు.. అసలేం జరిగిందంటే ?
ఐఏఎఫ్ కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందంలో తొమ్మిది విమానాలు ఉంటాయి. అవే ఈ ఎయిర్ షోలో పాల్గొంటాయి. ఈ టీమ్ ఇప్పటికే మరియు ఇది దేశవ్యాప్తంగా అనేక వైమానిక ప్రదర్శనలను నిర్వహించింది. విజయం నిర్మాణంలో లూప్ విన్యాసాలు, బ్యారెల్ రోల్ విన్యాసాలు, ఆకాశంలో వివిధ ఆకారాలుగా ఏర్పడటం ఈ టీమ్ ప్రత్యేకత.