మైసూరులోని చాముండేశ్వరీ దేవతకూ గృహ లక్ష్మీ పథకాన్ని వర్తింపజేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చాముండేశ్వరీ ఆలయ బ్యాంకు ఖాతాలోకి ప్రతి నెలా రూ. 2,000 జమ చేయాలని మహిళా, శిశ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీకి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచనలు చేశారు.
మైసూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఈ ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని మైసూరులోని చాముండేశ్వరీ దేవీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద నెలకు రూ. 2 వేలు చాముండేశ్వరీ ఆలయ ఖాతాలోకి పంపించాలని నిర్ణయించుకుంది.
ఆగస్టు 30వ తేదీన మైసూరులోని చాముండేశ్వరీ ఆలయం(Chamundeshwari Temple)లోనే గృహ లక్ష్మీ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా చాముండేశ్వరీ ఆలయానికే కేటాయించి ఈ పథకం విజయవంతంగా అమలు కావాలని దేవత చాముండేశ్వరీని కోరుకున్నారు. ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు అమలు చేస్తున్నారు.
undefined
గృహ లక్ష్మీ పథకం(Gruha Lakshmi Scheme) కింద చాముండేశ్వరీ దేవికి నెలకు రూ. 2,000 చెల్లించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పార్టీ స్టేట్ మీడియా సెల్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ గూలిగౌడ శుక్రవారం ఓ లేఖ రాశారు. ఈ విజ్ఞప్తికి డీకే శివకుమార్ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే దేవతా మూర్తి చాముండేశ్వరీకీ గృహ లక్ష్మీ పథకం కింద ప్రయోజనాలు అందేలా చూడాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌కు సూచనలు చేశారు. ప్రతి నెల చాముండేశ్వరీ ఆలయ ఖాతాలో రూ. 2,000 జమ చేయాలని సూచించారు.
తన విజ్ఞప్తికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారని, రూ. 2,000 ప్రతి నెలా చాముండేశ్వరీ ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్‌కు సూచించారని గూలిగౌడ ఓ ప్రకటనలో వెల్లడించారు.