కర్ణాటక: జీతాల్లో కోత.. ఉద్యోగుల ఆగ్రహం, ‘ యాపిల్ ’ యూనిట్ ధ్వంసం

By Siva KodatiFirst Published Dec 12, 2020, 9:51 PM IST
Highlights

కర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. 7 వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు

కర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. 7 వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

6 కోట్ల రూపాయల విలువైన విస్ట్రాన్ కంపెనీ బస్సులు, కార్లను తగలబెట్టారు. వీరికి మద్ధతుగా కార్యాలయం ఎదుట ఉద్యోగుల బంధువులు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంట్ బయట పార్క్ చేసి ఉంచిన కార్లు, ఫర్నిచర్ ను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. రూ.2 వేల 900కోట్లు కేటాయించి 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆశ చూపిన మేనేజ్మెంట్ నిరుత్సాహానికి గురిచేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాదాపు 2వేల మందికి పైగా ఉద్యోగులు.. ఆందోళనలో పాల్గొన్నారు. నైట్ షిఫ్ట్ పూర్తి అయిన తర్వాత ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్నట్లు కంపెనీ సమాచారం. ఘటనపై కంపెనీ ఎటువంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.

కంపెనీలో చాలా మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ మీదే పనిచేస్తున్నారని.. అంతేకాకుండా వారి జీతాల్లో చాలా రకాల కోతలు విధిస్తూ వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కు నెల జీతం రూ.21వేలు ఇస్తామని హామీ ఇచ్చి అతనికి రూ.16వేల జీతం మాత్రమే ఇచ్చేవారు. ఇటీవలి నెలల్లో అది రూ.12వేలు మాత్రమే అందేది.

నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ జీతం రూ.15వేల నుంచి రూ.8వేలకు పడిపోయిందని ఓ ట్రేడ్ యూనియన్ లీడర్  తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి భారీగా మోహరించి పరిస్ధితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ జరుగుతుందని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు.

click me!