తమిళనాడులో లారీ బీభత్సం: 15 కార్లు ధ్వంసం... ఆరుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Dec 12, 2020, 06:43 PM ISTUpdated : Dec 12, 2020, 07:08 PM IST
తమిళనాడులో లారీ బీభత్సం: 15 కార్లు ధ్వంసం... ఆరుగురు దుర్మరణం

సారాంశం

తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మపురి జిల్లాలో శనివారం భారీ కంటైనర్‌ను, సిమెంట్‌ ట్రైలర్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు

తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మపురి జిల్లాలో శనివారం భారీ కంటైనర్‌ను, సిమెంట్‌ ట్రైలర్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు.

ధర్మపురి - సేలం రహదారిపై తోప్పుర్ ఘాట్ రోడ్ వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనక వేగంగా వస్తున్న 15 వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి  ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో పది మంది తీవ్రగాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఈ ప్రమాదంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
click me!

Recommended Stories

మృత‌దేహం ప్రైవేట్ పార్ట్స్‌పై MBBS విద్యార్థిని పిచ్చి మాట‌లు.. కేసు న‌మోదు, అస‌లేం జ‌రిగిందంటే?
CM Vijay Lands in Mangaluru: మంగళూరు ఎయిర్ పోర్ట్ లోసీఎం విజయ్ కి ఘానా స్వాగతం | Asianet News Telugu